Viral News: రూ.6వేల ఫైన్ వేశారని.. పోలీసులకు తన పవర్ చూపించిన లైన్‌మెన్.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-08-26T14:37:29+05:30 IST

అతడు ఒక లైన్‌మెన్. తాజాగా ద్విచక్రవాహనంపై వెళ్తూ ఉంటే.. పోలీసులు అతడి బండిని ఆపారు. అనంతరం రూ.6వేల ఫైన్ వేశారు. ఈ క్రమంలో ఆ లైన్‌మెన్‌కు పట్టరాని కోపం వచ్చింది. కానీ.. అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేకపోయాడు. త

Viral News: రూ.6వేల ఫైన్ వేశారని.. పోలీసులకు తన పవర్ చూపించిన లైన్‌మెన్.. ఎక్కడంటే..

ఇంటర్నెట్ డెస్క్: అతడు ఒక లైన్‌మెన్. తాజాగా ద్విచక్రవాహనంపై వెళ్తూ ఉంటే.. పోలీసులు అతడి బండిని ఆపారు. అనంతరం రూ.6వేల ఫైన్ వేశారు. ఈ క్రమంలో ఆ లైన్‌మెన్‌కు పట్టరాని కోపం వచ్చింది. కానీ.. అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేకపోయాడు. తర్వాత సమయం చూసి పోలీసులకు చుక్కలు చూపించాడు. తన పవర్ తెలిసేలా చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇంతకూ ఏం జరిగింది.. పోలీసులు లైన్‌మెన్‌కు అంత మొత్తంలో ఫైన్ ఎందుకు వేశారు? లైన్‌మెన్ పోలీసులకు తన సత్తా ఎలా చూపించాడు? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..



ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని షామ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌(electricity department)లో లైన్‌మెన్‌(lineman)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు ఓ పని మీద ద్విచక్రవాహనంపై బయటికెళ్లాడు. ఈ క్రమంలో అతడిని అడ్డగించిన పోలీసులు.. హెల్మెట్ ధరించని కారణంగా రూ.6వేల ఫైన్ వేశారు. హెల్మెట్ ధరించని కారణానికి పెద్ద మొత్తంలో జరిమానా వేయడంతో అతడు ఆగ్రహానికి లోనయ్యాడు. కానీ అధికారుల ముందు వ్యక్త పరచలేదు. కానీ ఆ తర్వాత అధికారులకు తన సత్తా చూపించాడు. రూ.56వేల కరెంటు బిల్లు డ్యూ ఉందనే కారణాన్ని చూపుతూ.. పోలీసు స్టేషన్‌కు పవర్ కట్ చేశాడు(Lineman Cuts Power Supply of Police Station). తన పవరేంటో అధికారులకు చూపించాడు. దీంతో లైన్‌మెన్ చేసిన పని స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-08-26T14:37:29+05:30 IST