మైనర్‌ బాలికపై లైంగికదాడి

ABN , First Publish Date - 2021-03-07T05:51:36+05:30 IST

ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన దుండిపాలెంలో జరిగింది.

మైనర్‌ బాలికపై లైంగికదాడి

చుండూరు, మార్చి 6: ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన దుండిపాలెంలో జరిగింది. చుండూరు ఎస్‌ఐ పిల్లి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం బాలిక ఒంటరిగా ఇంటి వద్ద ఉన్న సమయంలో పొరుగున ఉండే బాలుడు పక్కనే ఉన్న పాకలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లి ఏడుస్తున్న కుమార్తెను విచారించగా జరిగిన సంఘటన వివరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఫోక్సో యాక్టు కింద నమోదు చేయడం జరిగిందని సీఐ బి.రమేష్‌బాబు, ఎస్‌ఐ శ్రావణి తెలిపారు. 

Updated Date - 2021-03-07T05:51:36+05:30 IST