హిందీలో లింక్డిన్‌

ABN , First Publish Date - 2021-12-04T05:30:00+05:30 IST

లింక్డిన్‌ హిందీ వెర్షన్‌ ఆరంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల మిలియన్ల మంది హిందీ మాట్లాడే ప్రొఫెషనల్స్‌ను...

హిందీలో లింక్డిన్‌

లింక్డిన్‌ హిందీ వెర్షన్‌ ఆరంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల మిలియన్ల మంది హిందీ మాట్లాడే ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రారంభించింది. భాషాపరమైన అడ్డంకులను అధిగమించాలన్నది లక్ష్యం. లింక్డిన్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 25 భాషల్లో సేవలు అందిస్తోంది. డెస్క్‌టాప్‌ మొదలుకుని ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్ల వరకు అన్నింటా హిందీ భాషలో తమ ప్రొఫైల్‌ను రూపొందించుకోవచ్చు. ఉద్యోగాలు, కంటెంట్‌ క్రియేషన్‌ సహా అన్ని వ్యాపకాలను హిందీలో చేపట్టవచ్చు. 


తదుపరి చర్యలో భాగంగా హిందీ మాట్లాడే వ్యక్తులకు ఉన్న అవకాశాలను కూడా ఇందులో పొందుపరుస్తుంది. బ్యాంకింగ్‌, ప్రభుత్వ ఉద్యోగాలు సహా అన్నింటికి వర్తింపజేస్తుంది. 

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు సెట్టింగ్స్‌లోకి హిందీ దగ్గరకు వెళితే చాలు. ఇప్పటికే హిందీని ఉపయోగిస్తుంటే అసలు ఏ ఇబ్బంది లేదు. అదే డెస్క్‌టాప్‌పై ‘మి’ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. లింక్డిన్‌ హోమ్‌పేజీ టాప్‌లో ‘సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీ’ని సెలెక్ట్‌ చేసుకోవాలి. లెప్ట్‌లో ఉన్న ‘అకౌంట్‌ ప్రిఫరెన్స్‌’ని క్లిక్‌ చేయాలి. సైట్‌ ప్రిఫరెన్స్‌ - చేంజ్‌ - లాంగ్వేజ్‌ - హిందీని ఎంపిక  చేసుకుంటే సరిపోతుంది. అమెరికా తరవాత ఇండియానే లింక్డిన్‌కు పెద్ద మార్కెట్‌ కావడం గమనార్హం.

Updated Date - 2021-12-04T05:30:00+05:30 IST