హైదరాబాద్‌లో తొలి ఈవీ చార్జింగ్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం.. ప్రారంభించిన లయన్ చార్జ్

ABN , First Publish Date - 2022-09-12T01:12:18+05:30 IST

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో తొలి ఈవీ చార్జింగ్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది

హైదరాబాద్‌లో తొలి ఈవీ చార్జింగ్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం.. ప్రారంభించిన లయన్ చార్జ్

హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో తొలి ఈవీ చార్జింగ్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. నగరంలోని జూబ్లీహిల్స్‌లో ‘లయన్ చార్జ్ ఈవీ’ ఈ స్టేషన్‌ ఏర్పాటు చేసింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, కొండగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 50 కిలోవాట్‌ లయన్ ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ వద్ద వినియోగదారులు తమ వాహనాలను చార్జ్‌ చేసుకోవచ్చు. తమ కారు చార్జ్‌ అయ్యే లోపు వారు అత్యంత ఆహ్లాదకరమైన లాంజ్‌లో సేద తీరుతూ కాఫీ కూడా సేవించవచ్చు. ఈవీ చార్జింగ్‌  హబ్‌లో  5 చార్జర్లు ఉన్నాయి. ఇక్కడ ఫోర్, త్రీ వీలర్ల వాహనాలతోపాటు బైక్‌లను కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ ఈవీ చార్జింగ్‌ హబ్‌లో 50కిలోవాట్‌ డీసీ చార్జర్‌ ఉంది. ఇది ఈవీని 50 నిమిషాల లోపు పూర్తిగా చార్జ్‌ చేస్తుంది. ఈవీ చార్జింగ్‌ హబ్‌లో 43కిలోవాట్‌ ఏసీ చార్జర్‌, 15 కిలోవాట్‌ జీబీ/టీ చార్జర్‌, మూడు 3కిలోవాట్‌ ఏసీ చార్జర్లు కూడా ఉన్నాయి.


ఈవీ చార్జింగ్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం ప్రారంభం సందర్భంగా లయన్ చార్జ్ ఫౌండర్, సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ గుత్తా వెంకటసాయివీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చార్జింగ్‌ కేంద్రం ఈవీ ప్రియులకు ఓ అవగాహన వేదికగా పనిచేస్తుందని అన్నారు. ఈవీ విప్లవం, వాటి పనితీరు, బ్యాటరీ సాంకేతికతల గురించి మరింతగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులకు అవగాహన మెరుగుపరచడం, ఈవీ చార్జింగ్‌ పట్ల ఉన్న అపోహలను పోగొట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. అలాగే, ఈ ప్లాట్‌ఫామ్‌ యువ ఔత్సాహికవేత్తలకు  మీటప్‌ కేంద్రంగా కూడా నిలుస్తుందని, వారి ఆలోచనలను పంచుకునే వేదికగా కూడా నిలుస్తుందని పేర్కొన్నారు.

Updated Date - 2022-09-12T01:12:18+05:30 IST