సింహం గర్జిస్తే...!

ABN , First Publish Date - 2021-11-02T05:30:00+05:30 IST

సింహం బరువు సుమారు 180 కిలోల వరకు ఉంటుంది. అరుదుగా కొన్ని సింహాలు 300 కేజీల వరకు ఉంటాయి...

సింహం గర్జిస్తే...!

సింహం బరువు సుమారు 180 కిలోల వరకు ఉంటుంది. అరుదుగా కొన్ని సింహాలు 300 కేజీల వరకు ఉంటాయి. ఆడ సింహం బరువు సుమారుగా 130 కేజీల వరకు ఉంటుంది. జీవితకాలం పన్నెండు సంవత్సరాలు ఉంటుంది.


  1.  సింహం గర్జిస్తే ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇవి ఒకేసారి 40 కేజీల వరకు మాంసం తినగలవు. 
  2.  ఇక వేటాడే బాధ్యత ఎక్కువ ఆడ సింహాలపైనే ఉంటుంది. ఎందుకంటే అవి మగ సింహాలతో పోలిస్తే బాగా వేటాడతాయి.
  3.  సింహాలకు ఒంట్లో సత్తువ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ దూరం పరుగెత్తవు. 
  4.  సింగపూర్‌, ఇథియోపియా, ఇంగ్లాండ్‌, బల్గేరియా, నెదర్లాండ్స్‌ దేశాల జాతీయ జంతువు సింహం.

Updated Date - 2021-11-02T05:30:00+05:30 IST