నాణ్యతకు తూట్లు

ABN , First Publish Date - 2021-04-18T05:16:08+05:30 IST

మండలంలోని ఆలమూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణంలో నాణ్యతకు తూట్లు పొడిచారు.

నాణ్యతకు తూట్లు
పాతరాళ్లతో పునాదుల నిర్మాణం

 రుద్రవరం, ఏప్రిల్‌ 17: మండలంలోని ఆలమూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణంలో నాణ్యతకు తూట్లు పొడిచారు. ఈ భవనాల  పునాదుల్లో పాత భవనాల నుంచి తొలగించిన రాళ్లు వినియోగించారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి రూ.1.86 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పునాదుల్లో  సిమెంట్‌, ఇసుక, కంకర వాడి బెడ్లు వేయాలి. కానీ ఉత్త కంకర పోశారు. ఈ నిర్మాణ పనులు ఎన్నాళ్లు ఉంటాయో అధికారులకే తెలియాలి.  అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టానుసారంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు.   


తొలగిస్తాం..
 ఖాళీ కంకర పునాదుల్లో పోయకూడదు. వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల మేర నిర్మాణ పనులు చేపడతాం. పాత రాళ్లు ఎన్ని వాడారో గుర్తించి ఆ రాళ్లకు బిల్లు తగ్గిస్తాం.
- ఆర్‌అండ్‌బీ ఏఈ వెంకటేశ్వరరెడ్డి 

Updated Date - 2021-04-18T05:16:08+05:30 IST