లక్ష్యానికి తూట్లు.. చెత్తతో పాట్లు..!

ABN , First Publish Date - 2022-05-17T06:48:39+05:30 IST

గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొనాలని, చెత్త సమస్యకు పరిష్కారం చూపా లని, పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కలిగించాలన్న ఉద్దేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన సంపద కేంద్రాలు చాలాచోట్ల నిరుప యోగంగా మారాయి.

లక్ష్యానికి తూట్లు.. చెత్తతో పాట్లు..!
సరుగుడు గ్రామంలో తుప్పలతో నిండి ఉన్న సంపద కేంద్రం ఆవరణ

 మండలంలోని పలు గ్రామాల్లో నిరుపయోగంగా సంపద కేంద్రాలు 

 గ్రామాలకు దూరంగా ఉండడంతో మందుబాబులు అడ్డాగా మారుతున్న వైనం 

పట్టించుకోని అధికారులు 

 చెత్త సమస్యకు పరిష్కారంతో పాటు పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్న గత టీడీపీ ప్రభుత్వ లక్ష్యానికి నీళ్లు


నాతవరం, మే 16 : గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొనాలని, చెత్త సమస్యకు పరిష్కారం చూపా లని, పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కలిగించాలన్న ఉద్దేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన సంపద కేంద్రాలు చాలాచోట్ల నిరుప యోగంగా మారాయి. ఫలితంగా  ఆయా గ్రామాలను చెత్త సమస్య వెం టాడుతూనే ఉంది. మండలంలోని 27 పంచాయతీల్లో 19 సంపద కేంద్రాలు పూర్తికాగా, ఎనిమిది వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన ఈ కేంద్రాలు ఆరంభంలో బాగానే పనిచేశాయి. పారి శుధ్య సిబ్బంది పొడి, తడి చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించే వారు. గ్రామాల్లో ఎక్కడా పెద్దగా చెత్త కనిపించేది కాదు. అప్పట్లో నాతవరం సంపద కేంద్రానికి రాష్ట్రస్థాయిలో అవార్డు సైతం వరించింది. అయితే ప్రస్తుతం ఉన్న సంపద కేంద్రాల్లో చాలా వరకు పనిచేయడం లేదు.  ఏపీపురం, గునుపూడి, గన్నవరం తదితర గ్రామాల్లోని సంపద కేంద్రాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. ఉదయం, సాయంత్రం తేడా లేకుండా పలువురు మద్యాన్ని తెచ్చుకుని, ఇక్కడ తాగుతూ ఆ సీసాలను వదిలి వెళుతు న్నారు. కొందరు మత్తులో ఆ సీసా లను అక్కడే పగుల గొడుతున్నారు. పలు పంచాయతీల్లో సంపద కేంద్రాలు పనిచేయని కారణంగా ఆయా రోడ్ల పక్కన చెత్తాచెదారాన్ని పలువురు గ్రామస్థులు పారబో స్తున్నారు. దీంతో పందులు వాటిలో చేరి చిందరవందర చేస్తున్నాయి. చిన్న పాటి వర్షం పడినా ఆ చెత్త కుళ్లి దుర్వాసన వెదజల్లు తోంది. దీంతో అంటు వ్యాధుల భయం వెంటాడు తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లక్ష లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి తద్వారా చెత్త సమస్యకు పరిష్కారం చూపుతూనే.. పంచాయతీలకు ఆదా యం సమకూరేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-05-17T06:48:39+05:30 IST