చిత్తూరు డెయిరీని పరిశీలించిన లిక్విడేటర్‌

ABN , First Publish Date - 2021-04-17T06:01:04+05:30 IST

నగరంలోని రెడ్డిగుంట సమీపంలో కొన్నేళ్లుగా మూతపడ్డ విజయా డెయిరీని లిక్విడేటర్‌, చిత్తూరు డివిజనల్‌ కో- ఆపరేటివ్‌ అధికారిణి వనజ శుక్రవారం సందర్శించారు. లోపల ఉన్న చీజ్‌ ప్లాంట్‌, బాటిలింగ్‌ యూనిట్లు, నెయ్యి ప్లాంటు, బాయిలర్లు, యంత్రాలను పరిశీలించారు. వాటి ప్ర

చిత్తూరు డెయిరీని పరిశీలించిన లిక్విడేటర్‌
డెయిరీని పరిశీలిస్తున్న లిక్విడేటర్‌ వనజ

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16: నగరంలోని రెడ్డిగుంట సమీపంలో కొన్నేళ్లుగా మూతపడ్డ విజయా డెయిరీని లిక్విడేటర్‌, చిత్తూరు డివిజనల్‌ కో- ఆపరేటివ్‌ అధికారిణి వనజ శుక్రవారం సందర్శించారు. లోపల ఉన్న చీజ్‌ ప్లాంట్‌, బాటిలింగ్‌ యూనిట్లు, నెయ్యి ప్లాంటు, బాయిలర్లు, యంత్రాలను పరిశీలించారు. వాటి ప్రస్తుత పరిస్థితులను నమోదు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని డీఎల్‌సీవో తెలిపారు. ఆమె వెంట సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్ర్టార్లు సంపత్‌, బీపీ నరసింహన్‌, విజయలక్ష్మి ఉన్నారు.


Updated Date - 2021-04-17T06:01:04+05:30 IST