ఎస్‌ఏపేటలో బెల్లపు ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2021-05-07T05:34:29+05:30 IST

ఎస్‌ఏపేటలో బెల్లపు ఊట ధ్వంసం

ఎస్‌ఏపేటలో బెల్లపు ఊట ధ్వంసం

ఆగిరిపల్లి, మే 6: మండల పరిధిలోని సింహాద్రి అప్పారావుపేటలో గురువారం 1,800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్టు నూజివీడు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ఎస్‌.సాయిస్వరూప్‌ తెలిపారు. గ్రామంలో విచ్చలవిడిగా కాపుసారా బట్టీలు పెట్టి సారా తయారీని కుటీర పరిశ్రమగా మారుస్తున్నందున ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టిపెట్టి దాడులు చేస్తున్నామన్నారు. సారా బట్టీలను, బెల్లపు ఊటను ధ్వంసం చేసి,  సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు.

 10 లీటర్ల నాటు సారా స్వాధీనం 

విస్సన్నపేట: విస్సన్నపేట ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌లో పలు గ్రామాల్లో ఎక్సైజ్‌ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో విస్సన్నపేటలో 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఒకర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌చార్జి సీఐ ఏవీవీ శ్రీనివాసరావు తెలిపారు. 

Updated Date - 2021-05-07T05:34:29+05:30 IST