మద్యం సేవించేవాళ్లు భారతీయులు కాదు: సీఎం నితీశ్

Published: Thu, 31 Mar 2022 15:38:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మద్యం సేవించేవాళ్లు భారతీయులు కాదు: సీఎం నితీశ్

పాట్నా: మద్యం సేవించేవాళ్లు భారతీయులు కాదని, వారంతా మహా పాపులని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. బుధవారం బిహార్‌లో నూతన మద్యం విధానం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గురువారం నాటు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ‘‘మహాత్మ గాంధీ మద్యం సేవించలేదు. మద్య సేవనాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గాంధీ విలువల్ని పాటించని వారంతా మహాపాపులు. నేను ఆ వ్యక్తుల్ని భారతీయులుగా ఎంత మాత్రం అంగీకరించను’’ అని అన్నారు.


‘‘కొంత మంది మద్యం సేవించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అందులో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మద్య నిషేధం అనేది అమలు కావాలి. అందుకోసమే ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. కానీ ఈ చట్టాన్ని ఎవరూ పాటించడం లేదు. మనకు గాంధీ ఆదర్శం కావాలి. ఆయన మద్యపానానికి వ్యతిరేకం. ఆయన విలువల్ని మనం కాపాడాలి’’ అని బిహార్ అసెంబ్లీలో నితీష్ అన్నారు.


'మద్యపాన నిషేధ బిల్లు-2022 బిల్లు(సవరణ)'కు బుధవారం బిహార్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. కాగా, ఆ చట్టానికి తాజాగా కొన్ని సవరణలు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం.. ఇక నుంచి ఎవరైనా మద్యం సేవిస్తున్నట్లు, అమ్ముతున్నట్లు కనిపిస్తే వారిని సాధారణ కోర్టుకు కాకుండా ఎక్సైజ్ కోర్టుకు పంపనున్నట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సునీల్ కుమార్ తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.