Hyderabad : 10 నిమిషాల్లో లిక్కర్‌ డెలివరీ..

ABN , First Publish Date - 2022-06-03T08:43:32+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌.. ఆన్‌లైన్‌ ఆర్డర్‌పై 10 నిమిషాల్లో లిక్కర్‌ డెలివరీ సేవలను కోల్‌కతాలో ప్రారంభించింది.

Hyderabad : 10 నిమిషాల్లో లిక్కర్‌ డెలివరీ..

  • హైదరాబాద్‌ స్టార్టప్‌ వినూత్న సర్వీసు..
  • కోల్‌కతాలో ప్రారంభం 


కోల్‌కతా: హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌.. ఆన్‌లైన్‌ ఆర్డర్‌పై 10 నిమిషాల్లో లిక్కర్‌ డెలివరీ సేవలను కోల్‌కతాలో ప్రారంభించింది.  దేశంలో పలు కంపెనీలు ఇప్పటికే ఆన్‌లైన్‌ ఆర్డర్‌పై లిక్కర్‌ డెలివరీ సేవలందిస్తున్నప్పటికీ, పది నిమిషాల్లోనే చేరవేసే తొలి ప్లాట్‌ఫామ్‌ తమదేనని ఆన్‌లైన్‌ డెలివరీ అగ్రిగేటర్‌ బూజీ పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌ ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నాకే ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు బూజీ స్పష్టం చేసింది. ఇన్నోవెంట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్‌ అయిన బూజీ.. కస్టమర్‌కు దగ్గర్లోని వైన్స్‌ నుంచి లిక్కర్‌ డెలివరీ అందించనుంది. 

Updated Date - 2022-06-03T08:43:32+05:30 IST