కారుతోపాటు రూ.8 లక్షల విలువైన మద్యం సీజ్‌

ABN , First Publish Date - 2021-03-02T06:50:14+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సెబ్‌ అధికారులు రాష్ట్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

కారుతోపాటు రూ.8 లక్షల విలువైన మద్యం సీజ్‌
పట్టుబడ్డ మద్యాన్ని చూపుతున్న సెబ్‌ అధికారులు

భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం 

హిందూపురం టౌన, మార్చి 1: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సెబ్‌ అధికారులు రాష్ట్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున కర్ణాటక మద్యం పట్టుబడినట్లు సెబ్‌ సీఐలు శ్రీరామ్‌, నరసింహులు తెలిపారు. చిలమత్తూరు మండలం వీరాపురం క్రాస్‌, శెట్టిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 23 మద్యం బాక్సులు తరలిస్తుండగా పట్టుబడ్డారు. 1872 టెట్రా ప్యాకెట్లతోపాటు 58 మద్యం ఫుల్‌బాటిళ్లు, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యాన్ని ఆంధ్రప్రదేశకు తరలిస్తున్నారు. ఈ మద్యాన్ని ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోబాలకు గురిచేసేందుకు తీసుకెళ్తున్నారన్న అనుమానంతో స్వాధీనం చేసుకుని మద్యాన్ని తరలిస్తున్న కారు, ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశామన్నారు. అదేవిధంగా దేమకేతేపల్లికి చెందిన నరసింహప్ప, అనంతపురంకు చెందిన బయప్పరెడ్డి, ధర్మవరంకు చెందిన జిలానబాషాలను అరె్‌స్టచేశామన్నారు. ఈ దాడుల్లో సెబ్‌ ఎస్‌ఐలు ఫనీంద్రనాథ్‌, మల్లికార్జునరెడ్డి, సరోజాదేవి సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T06:50:14+05:30 IST