షాకింగ్.. భారత్‌లోనే ఉన్న ఈ ఐదు ప్రాంతాల్లోకి భారతీయులకు నో ఎంట్రీ..!

ABN , First Publish Date - 2021-06-21T17:29:41+05:30 IST

ప్రపంచంలో బాగా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఓ పౌరుడు దేశంలోని ఏ ప్రాంతానికి అయినా వెళ్లి జీవించవచ్చు. ఉపాధి పొందవచ్చు. ఏ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల వాళ్లను పొమ్మనదు.. వెళ్లిపొమ్మనే హక్కు కూడా ఉండదు.

షాకింగ్.. భారత్‌లోనే ఉన్న ఈ ఐదు ప్రాంతాల్లోకి భారతీయులకు నో ఎంట్రీ..!

ప్రపంచంలో బాగా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఓ పౌరుడు దేశంలోని ఏ ప్రాంతానికి అయినా వెళ్లి జీవించవచ్చు. ఉపాధి పొందవచ్చు. ఏ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల వాళ్లను పొమ్మనదు.. వెళ్లిపొమ్మనే హక్కు కూడా ఉండదు. కానీ కొన్ని ప్రాంతాల్లో భారతీయులకు ప్రవేశం లేదని మీకు తెలుసా..? ఓ ఐదు ప్రాంతాలకు భారతీయులు కనుక వెళ్తే మర్యాదగా వెనక్కు పంపేస్తారు. మీకు ప్రవేశం లేదు అని ముఖం మీదే చెప్పేస్తారు. లోపలకు అనుమతించరు. ఇవి ఎక్కడో కాదండోయ్, మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకతోపాటు గోవా వంటి ప్రముఖ ప్రాంతాల్లో ఉన్నాయని తెలుసా? ఈ ప్రాంతాల జాబితాతోపాటు అసలు కారణాలేంటన్నది ఓ లుక్కేయండి..


1. యూనో ఇన్ హోటల్, కర్ణాటక

హైటెక్ సిటీ బెంగళూరులో ఉన్న ప్రముఖ హోటల్ యూనో ఇన్ హోటల్. శాంతినగర్‌లో ఉన్న ఈ హోటల్ కేవలం జపనీయులకే. దీనిలో ఒక రూఫ్‌టాప్ జపనీస్ రెస్టారెంట్ ఉంది. దీనిపేరు టెప్పెన్. అయితే ఇక్కడకు జపనీయులు కాని వారికి అనుమతి లేదు. కేవలం జపనీయులకే.


2. ఫ్రీ కాసోల్ కేఫ్, హిమాచల్ ప్రదేశ్

2015లో భారతీయులకు సర్వీసులు ఇవ్వబోమని ప్రకటించి పాపులర్ అయిన కేఫ్ ఇది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాసోల్ ప్రాంతంలోని ఈ కేఫ్‌లోకి కేవలం ఇజ్రాయలీలకే పర్మిషన్. విదేశీయులతో భారతీయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అందుకే వారికి తమ కేఫ్‌లో అనుమతి నిరాకరిస్తున్నామని ఈ కేఫ్ ప్రకటించింది.


3. బ్రాడ్‌ల్యాండ్ లాడ్జి, తమిళనాడు

తమిళనాడులో ఉన్న ఈ బ్రాడ్‌ల్యాండ్ లాడ్జిలో భారతీయులకు నో ఎంట్రీ. విదేశీ పాస్‌పోర్టులు ఉన్న వారికి మాత్రమే ఈ లాడ్జిలో రూమ్స్ ఇస్తారు. ఇలాంటి వివక్షాపూరిత విధానాల వల్ల ఈ లాడ్జి హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ ‘నో ఇండియన్ పాలసీ’ని చాలా కఠినంగా అమలు చేస్తారు.


4. ఫారెనర్స్ ఓన్లీ బీచ్, గోవా

గోవా అంటేనే బీచులు, వాటర్ స్పోర్ట్స్. అందుకే ఇది యువత మదిలో మెదిలే తొలి హాలీడే డెస్టినేషన్. అయితే ఇక్కడ కొన్ని బీచులు, రెస్టారెంటులు కేవలం విదేశీయులకే ప్రత్యేకం. వీళ్లందరూ భారతీయుల కన్నా విదేశీయులనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అందుకే భారతీయులు ఇక్కడకు రాకుండా నిషేధం విధించారు. బికినీలు వేసుకొని ఉండే విదేశీయులను భారతీయులు వింతగా చూస్తుంటారని, ఇబ్బంది పెడతారని వీళ్లందరూ చెప్తారు. ఇలా చాలా ఘటనలు జరిగాయట. అందుకే ఈ రూల్ పెట్టినట్లు వీళ్లు చెప్తారు.


5. ఫారెనర్స్ ఓన్లీ బీచ్, పుదుచ్చేరి

గోవాలోలానే పుదుచ్చేరిలో కూడా కొన్ని బీచులు విదేశీయులకే ప్రత్యేకం. గోవాలో వాళ్లు చెప్పే కారణాలే ఇక్కడి రెస్టారెంటు ఓనర్లు కూడా చెప్తారు. ఇలా ఏదో ఒక కారణంతో భారతదేశంలో ఉన్న ప్రాంతాల్లో భారతీయులనే నిషేధించడం వింతగా లేదూ?



Updated Date - 2021-06-21T17:29:41+05:30 IST