సిరిసిల్ల ప్రాంతానికి సాహిత్య వారసత్వం

Jul 30 2021 @ 01:04AM
మాట్లాడుతున్న గోరేటి వెంకన్న

- తెలుగుసాహిత్యం మహాకవుల్లో సినారే ఒకరు 

- ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, జూలై 29: సిరిసిల్ల ప్రాంతా నికి సాహిత్య వారసత్వం ఉందని, తెలుగు సాహి త్యం మహాకవుల్లో సినారే ఒకరని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. గురువారం సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి నారాయణరెడ్డి జయంతిని పురస్కరించుకొని కవులు, కళాకారులకు అక్కపల్లి మమత ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో సన్మాన కార్యక్రమాన్ని గ్రంథాలయ చైర్మన్‌ ఆ కునూరి శంకరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరెటి వెం కన్న సినారే చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సినారే రాసిన పాటలు, పద్యాలు, కావ్యాలు అన్ని భాషలలో అనువాదం అయ్యాయన్నారు. కవి త్వంలో ఉన్నత శిఖరాలను అందుకున్న విశ్వనాథ స త్యనారాయణలాంటి మహాకవి ఇక్కడి ప్రాంతంలో పనిచేశాడని, ఆయన పాదం మోపిన నేలకు అలాం టి వారసత్వం ఉందన్నారు. గ్రంథాలయ సంస్థ చాలా బాగుందని, దీనిని చూస్తే తిరుమల శ్రీవారి ఆలయాన్ని చూసినట్లుగా ఉందని, ఇదంతా కేటీఆర్‌ చొరవతో సాధ్యమయిందన్నారు. వివిధరంగాల్లో గు ర్తింపు పొందిన 12 మందికి సినారే విశిష్ట పురస్కా రాలను అందించారు. పెద్దింటి అశోక్‌ కుమార్‌కు న వలా రంగంలో, ఆకునూరి శంకరయ్య(సాహిత్య పో షణ), వెంగల లక్ష్మణ్‌(సాహిత్య రంగం), ఎండీ సలీం(వ్యాఖ్యాత రంగం), కీసరి నర్సింలు(నటన), ఎ డమల ప్రతాపరెడ్డి(కళా రంగం), వెంగళ గణేష్‌కు (చిత్రకళా), గడ్డం దేవయ్య(నాట్యం), తీగల రాజే శం(ఒగ్గు కళా), రాయల చంద్రమౌలి(సింధు కళా రంగం), గడ్డం నర్సయ్య(ఈలపాట), బొడ్డు రాము లు (నటన) రంగంలో  విశిష్ట పురస్కారాలను అం దుకున్నారు. అనంతరం మానేరు రచయితల సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినారే ఫొటో చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం గ్రంథాల య సంస్థ ఆధ్వర్యంలో గోరెటి వెంకన్నను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, కవులు, కళాకారులు పాల్గొన్నారు. 


Follow Us on: