సాహిత్యం.. సర్వకాలీనం

ABN , First Publish Date - 2022-03-20T04:37:29+05:30 IST

సాహిత్యం సర్వకాలీనమని, అది వివిధ ప్రాంతాల నుంచి రావడం తెలంగాణ వైభవ విశిష్టతని ప్రముఖ కవి కూకట్ల తిరుపతి చెప్పారు.

సాహిత్యం.. సర్వకాలీనం
తెలంగాణ వైభవం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న తిరుపతి

సిద్దిపేట, మార్చి 19 : సాహిత్యం సర్వకాలీనమని, అది వివిధ ప్రాంతాల నుంచి రావడం తెలంగాణ వైభవ విశిష్టతని ప్రముఖ కవి కూకట్ల తిరుపతి చెప్పారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలో పెందోట వెంకటేశ్వర్లు ప్రధాన సంపాదకుడిగా వెలువడిన తెలంగాణ వైభవం కవితా సంకలనాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 14వ శతాబ్దంలో మడికి సింగన కవి సకలనీతి సమ్మతం పేరుతో సాహిత్య చరిత్రలో మొట్టమొదటి సంకలనం తీసుకొచ్చాడని చెప్పారు. నాటి నుంచి ఎన్నో సంకలనాలు వెలువడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంపాదకుడు ఎర్రోజు వెంకటేశ్వర్లు, నర్సింగోజు నరేష్‌, సయ్యద్‌ సమీనా పర్వీన్‌, రాములు, కొండపర్తి ఆనందాచారి, నమశివాయ సుధాకర్‌, బూర దేవానందం, రాములు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-20T04:37:29+05:30 IST