Viral Video: వీధిలో మాస్ డ్యాన్స్ అదరగొట్టిన బాలిక.. నెటిజన్లు ఫిదా!

Published: Wed, 17 Aug 2022 19:15:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: వీధిలో మాస్ డ్యాన్స్ అదరగొట్టిన బాలిక.. నెటిజన్లు ఫిదా!

సాంప్రదాయ నృత్యాల కంటే జానపద నృత్యాలు, ఊర మాస్ డ్యాన్స్‌లు చిన్న పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి. ఆ సౌండ్‌కు చిన్నారులు కూడా చిందులేస్తుంటారు. ఓ బాలిక వీధి కళాకారులతో కలిసి మాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. కర్ణాటకలోని ఉడిపిలో ఈ వీడియోను చిత్రీకరించారు. VisitUdupi అనే ట్విటర్ పేజీలో ఈ వీడియో పోస్ట్ అయింది. 


ఈ వీడియోలో ఒక మహిళ చిన్న అమ్మాయితో కలిసి డ్యాన్సర్ వద్దకు వెళ్లి పూలమాల వేసింది. తనతో పాటు ఉన్న బాలికను ఆ డ్యాన్సర్‌తో పాటు డ్యాన్స్ వేయమని ప్రోత్సహించింది. చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఆ బాలికను ఉత్సాహపరిచారు. దీంతో ఆ బాలిక మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్సర్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ (Little girl dance) వేసింది. ఆగస్టు 13న పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పటివరకు ఐదు లక్షల వ్యూస్ దక్కించుకుంది. చక్కగా డ్యాన్స్ చేసిన చిన్నారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.