Viral Video: ఈ చిన్నారికి అస్సలు భయం లేదు.. పామును ఎలా కౌగిలించుకుని పడుకుందో చూడండి!

ABN , First Publish Date - 2022-09-25T18:48:14+05:30 IST

ప్రపంచంలో ఏ జీవి అయినా సాధారణంగా.. తన ప్రాణాలకు ముప్పు అని అభద్రతా భావానికి లోనైనప్పుడే ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు కూడా అంతే. తనకు ముప్పు అని భావిస్తునే అది అటాక్ చేస్తుంది. లేదంటే తన

Viral Video: ఈ చిన్నారికి అస్సలు భయం లేదు.. పామును ఎలా కౌగిలించుకుని పడుకుందో చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఏ జీవి అయినా సాధారణంగా.. తన ప్రాణాలకు ముప్పు అని అభద్రతా భావానికి లోనైనప్పుడే ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు కూడా అంతే. తనకు ముప్పు అని భావిస్తునే అది అటాక్ చేస్తుంది. లేదంటే తన దారిన అది వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ పాములు కంట పడగానే చాలా మంది భయంతో వణికిపోతారు. కానీ ఓ చిన్నారి మాత్రం.. అందరితో తనను పోల్చొద్దు అంటోంది. ఏ మాత్రం భయం లేకుండా భారీ పామును దిండులా కౌగిలించుకుని పడుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






10ఏళ్ల లోపు వయసు ఉన్న ఓ చిన్నారికి పామంటే అస్సలు భయం లేదు. పెంపుడు జంతువును ట్రీట్ చేస్తున్నట్టు దాంతో ఆటలు ఆడుతోంది. బెడ్‌పై పడుకుని బంగారు వర్ణంలో ఉన్న ఒక భారీ కొండ చిలువను దిండులా పట్టుకుని ప్రశాంతంగా కళ్లు మూసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కొందరు ఆ చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో ‘ఈ చిన్నారికి అస్సలు భయం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-09-25T18:48:14+05:30 IST