ప్రేయసికి ప్రియుడి వాలంటైన్స్ డే గిఫ్ట్.. షాకైన యువతి పోలీసులను ఆశ్రయించి..

ABN , First Publish Date - 2022-02-14T19:29:07+05:30 IST

వారిద్దరూ ప్రేమికులు.. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పది నెలలుగా ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు..

ప్రేయసికి ప్రియుడి వాలంటైన్స్ డే గిఫ్ట్.. షాకైన యువతి పోలీసులను ఆశ్రయించి..

వారిద్దరూ ప్రేమికులు.. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పది నెలలుగా ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు.. తాజాగా ఆమెకు బాయ్‌ఫ్రెండ్ గట్టి షాకిచ్చాడు.. వాలంటైన్స్ డే‌కు ముందు రోజు ఆమెను తన ఇంట్లో నుంచి తరిమేశాడు.. మరొక యువతితో అతను ప్రేమలో పడడమే దానికి కారణం.. దీంతో ఆమె చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌కు సమీపంలోని ధార్‌కు చెందిన యువకుడు సీతారామ్‌తో బాధిత యువతి ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో అతడితో శారీరక సంబంధం కూడా పెట్టుకుంది. పది నెలలుగా ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న సమయంలో ఆ యువతికి సీతారామ్ షాకిచ్చాడు. వేరే యువతితో ప్రేమలో పడి ఈమెను తన ఇంటి నుంచి తరిమేశాడు. 


షాకైన యువతి తన సోదరికి విషయం మొత్తం చెప్పింది. ఆమె సలహాతో పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరు చెప్పి సీతారామ్ తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-02-14T19:29:07+05:30 IST