లివర్‌ కేన్సర్‌ శాస్త్రీయ అవగాహన

Dec 22 2020 @ 11:21AM

ఆంధ్రజ్యోతి(22-12-2020)

జీర్ణక్రియతో పాటు అనేక శారీరక జీవక్రియల్లో నిరంతరం కీలక పాత్ర పోషించే కాలేయం జబ్బు పడుతుంది. దీన్లో కణితులు తలెత్తుతాయి. అయితే ఇవన్నీ కేన్సర్‌ రకం అయి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. వివిధ కారణాలతో కాలేయం జబ్బుపడినప్పుడు ఆ వ్యాధికారక ప్రాంతాల నుంచి కేన్సర్‌ తలెత్తుతుంది. లివర్‌ పాడయ్యే అలాంటి పరిస్థితుల్లో ఒకటి సిర్రోసిస్‌.


హెపటైటిస్‌ బి, సి ఇన్‌ఫెక్షన్లు, విపరీతమైన మద్యపానం, పుట్టుకతో ఉండే లోపాలతో  కాలేయం వ్యాధిగ్రస్థమవుతుంది. పిల్లల్లో జన్యు లోపాలు సిర్రోసి్‌సకు దారితీసి కేన్సర్‌గా పరిణమిస్తుంది. 3 నుంచి 5 ఏళ్ల వయసు పిల్లల్లో తలెత్తే ఈ వ్యాధిని హెపటోబ్లాస్టోమా అంటారు. కేన్సర్‌ పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. కడుపు ఎడమ వైపు నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, వ్యాధి తీవ్రత పెరిగి కామెర్లు రావడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలలో రక్తం పోవడం, కడుపులో నీరు చేరడం, ఊబకాయం వంటి లక్షణాలు కాలేయ కేన్సర్‌లో ప్రధానంగా కనిపిస్తాయి. 


లివర్‌ కేన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తులు (తీవ్ర మద్యపానం అలవాటు ఉన్నవారు) అలా్ట్రసౌండ్‌, సీరం ఎ.ఎ్‌ఫ.పి పరీక్షలతో కాలేయ కేన్సర్‌ను గుర్తించవచ్చు. వీటితో పాటు సిటి స్కాన్‌, ఎమ్మారై, బయాప్సీలతో కూడా కేన్సర్‌ను గుర్తించవచ్చు. చాలా సందర్భాల్లో కేన్సర్‌ చికిత్సకు ఆపరేషన్‌ అవసరం అవుతుంది. కేన్సర్‌ సోకిన ప్రాంతాన్ని గుర్తించి, తొలగిస్తారు. దీన్నే హెపక్టమీ అంటారు. ఓపెన్‌ పద్ధతితో పాటు లాప్రోస్కోపిక్‌ కూడా అనుసరిస్తున్నారు. ఈ ఆధునిక పద్ధతిలో సర్జరీ సులభంగా, సురక్షితంగా చేసే వీలుంటుంది. రోగి కూడా త్వరగా కోలుకుంటాడు. సర్జరీ తట్టుకోలేని పరిస్థితిలో కీమోథెరపీ ఉపయోగడుతుంది. టి.ఎ.సి.ఇ విధానం, మైక్రోవేవ్‌ అబ్లేషన్‌   ద్వారా సర్జరీతో పనిలేకుండా నేరుగా కణితిని గుర్తించి అబ్లేషన్‌తో చికిత్స చేయవచ్చు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేన్సర్‌కు పూర్తిస్థాయి చికిత్స సాధ్యపడుతోంది. వ్యాధి బాగా ముదిరిపోయిన కేసుల్లో నాణ్యమైన శేషజీవితాన్ని అందించడం సాధ్యపడుతోంది. 


కాలేయ వ్యాధుల నివారణకు ఆరోగ్యకరమైన అలవాట్లు, సమతుల ఆహారంతో కూడిన జీవనవిధానం మంచిది. మద్యపానానికి దూరంగా ఉండాలి. హెపటైటిస్‌ బి వ్యాక్సీన్‌తో లివర్‌ సిర్రోసిస్‌, తదనంతర కేన్సర్‌ రాకుండా నివారించుకోవచ్చు. కాలేయ సమస్యలకు చికిత్స చేయడంలో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌ పేరు పొందింది. ఇక్కడ ఆధునిక టెక్నాలజీ, అధునాతన పరికరాలతో కూడిన వ్యవస్థలు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ వైద్య సంస్థలలో పరిశోధనలు చేసిన డాక్టర్‌ ఆర్‌.వి రాఘవేంద్రరావు నేతృత్వంలోని డాక్టర్ల టీమ్‌ వివిధ రకాల లివర్‌, జీర్ణకోశ సమస్యల పరిష్కారంలో నిపుణులు. లివర్‌ కేన్సర్‌ సహా అనేక సమస్యలను ఆధునిక పరికరాలతో, సురక్షిత విధానాలతో పరిష్కరించిన ట్రాక్‌ రికార్డు వీరి సొంతం.

డాక్టర్‌ ఆర్‌.వీ రాఘవేంద్రరావు,

M.S, M.Ch, (SGP-GI), F.H.P.B, F.L.T, (SNUH)

సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌,

డైరెక్టర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌,

ఎమ్మెల్యే కాలనీ, రోడ్‌ నెం:12, 

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌

ఫోన్‌: 7993089995 

email: [email protected]


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.