ఓటేసేందుకు ఆసక్తిచూపని హైదరాబాదీలు... అద్వానీ సూచన సూటవుతుందా?

ABN , First Publish Date - 2020-12-01T22:06:45+05:30 IST

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపలేదు. విద్యావంతులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అతి స్వల్పంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఓటేసేందుకు ఆసక్తిచూపని హైదరాబాదీలు... అద్వానీ సూచన సూటవుతుందా?

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపలేదు. విద్యావంతులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అతి స్వల్పంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని వార్డుల్లో ఒక శాతం పోలింగ్ కూడా నమోదు కాకపోవడం ప్రజాస్వామ్యప్రియుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలని బీజేపీ అగ్రనేత అద్వానీ గతంలో చేసిన సూచనపై మళ్లీ చర్చ మొదలైంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఓటు వేయడం తప్పనిసరి చేయాలని గతంలో అనేకసార్లు సూచించారు. అంతేకాదు ఓటు వేయనివారికి భవిష్యత్తులోనూ ఓటేసే అవకాశం లేకుండా చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసే ఓటర్లు ఓటేసేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఓటును పెద్ద సీరియస్‌గా తీసుకోవడం లేదు. 


ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు హక్కును ఓటర్లు ఉపయోగించుకోకపోవడంపై మేధావులు తప్పుబడుతున్నారు. పార్టీలను, ప్రజాప్రతినిధులను నిలదీయాలంటే ఓటే మార్గమని సూచిస్తున్నారు. బద్దకాన్ని వీడితేనే ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. 



జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ శాతం ఇలా..


కొండాపూర్- 9.98%


రాజేంద్రనగర్- 9.90%


విజయనగర్ కాలనీ- 9.0 %


ఆల్విన్‌ కాలనీ- 3.85%


సోమాజిగూడ- 2.77%


అమీర్‌పేట్- 0.79%




ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో..


కొండాపూర్- 9.98%


బంజారాహిల్స్- 21.36%


మాదాపూర్- 13.54 % 


జూబ్లీహిల్స్- 12.47%


కూకట్‌పల్లి- 12.37 %

Updated Date - 2020-12-01T22:06:45+05:30 IST