ఆహాలో 'ఎల్కేజీ'

Jun 23 2021 @ 08:21AM

తెలుగు ఓటీటీలో తమిళ హిట్ సినిమా 'ఎల్కేజీ' విడుదలకు సిద్దమవుతోంది. తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ సెటైరికల్ చిత్రం 2019 ఫిబ్రవరిలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఆర్జే బాలాజీ ముఖ్యమంత్రి పాత్రలో నటించగా, ప్రియా ఆనంద్, జెకె రితేష్, నంజిల్ సంపత్ ఇతర కీలకపాత్రలలో నటించారు. కేఆర్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇషారీ కె గణేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని త్వరలో తెలుగు 'ఆహా' ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. తెలుగు భాషలో స్ట్రీమింగ్‌కి రెడీ అవనున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. కాగా ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో, నయనతార అమ్మరిపాత్రలో నటించిన 'మూకుత్తి అమ్మన్' సూపర్ హిట్‌గా నిలిచింది. దీనికి ఆర్జే బాలాజీ రచన, దర్శకత్వం వహించాడు.  


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.