Loan Apps: లోన్‌యాప్స్‌ ఆగడాలపై ఈడీ దూకుడు

ABN , First Publish Date - 2022-09-03T21:16:35+05:30 IST

లోన్‌యాప్స్‌ (Loan Apps) ఆగడాలపై ఈడీ దూకుడు పెంచింది. 18 ప్రాంతాల్లో ఈడీ (Enforcement Directorate) అధికారుల సోదాలు చేశారు.

Loan Apps: లోన్‌యాప్స్‌ ఆగడాలపై ఈడీ దూకుడు

హైదరాబాద్: లోన్‌యాప్స్‌ (Loan Apps) ఆగడాలపై ఈడీ దూకుడు పెంచింది. 18 ప్రాంతాల్లో ఈడీ (Enforcement Directorate) అధికారుల సోదాలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ (Hyderabad Delhi)లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. పేమెంట్‌ గేట్‌వేస్‌, రోజర్‌ పే, పేటీఎం పేమెంట్స్‌ (Paytm Payments), క్యాష్‌ ఫ్రీ పేటీఎం కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నకిలీ బ్యాంక్‌ ఖాతాలు గుర్తించారు. పేమెంట్‌ గేట్‌వేల ద్వారా విదేశాలకు డబ్బులు బదిలీ చేస్తున్నట్లు గుర్తించారు.రూ.17 కోట్లను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. 


మరోవైపు లోన్‌ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్‌ రుణాలపై నిబంధనలను రిజర్వు బ్యాంక్ (Reserve Bank) కఠినతరం చేసింది. అధిక వడ్డీ రేట్ల నివారణకు, రుణ వసూళ్లలో అనైతిక పద్ధతులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల మేరకు డిజిటల్‌లో అన్ని రుణాల పంపిణీ, తిరిగి చెల్లింపులు రుణగ్రహీత, నియంత్రిత సంస్థ (ఆర్‌ఈ..బ్యాంకు/ఎన్‌బీఎఫ్‌సీ) బ్యాంకు ఖాతాల మధ్య మాత్రమే జరగాలి. ఎల్‌ఎస్‌పీ(లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌)ల ఖాతాల ద్వారా నిర్వహించే ఆస్కారం ఉండకూడదు. అలాగే, రుణ మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఎల్‌ఎ్‌సపీకి చెల్లించాల్సిన ఫీజులు, చార్జీలు తదితరాలు నేరుగా నియంత్రిత సంస్థే చెల్లించాలి తప్ప, రుణ గ్రహీత కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Updated Date - 2022-09-03T21:16:35+05:30 IST