తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కొమరయ్య
గణపురం, జనవరి 23: ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ష్యూరిటీ లేకుండా మంజూరు చేయాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అఽధ్యక్షుడు రేణికుంట్ల కొమరయ్య డిమాండ్ చేశారు. ఈనెల 28, 29 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద చేపట్టే దీక్షకు సంధించిన కరపత్రాలను భూపాలపల్లి జిల్లా గణపురంలోని అంబేద్కర్ భవన్‌లో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఎస్సీలకు బ్యాంకర్లు కొర్రీలు పెట్టకుండా షరతులు లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేకల ఓంకార్, ఎలుకటి రాజయ్య, దూడెపాక శ్రీనివాస్, చిలువేరు సాగర్, ఇనుగాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.