
వనపర్తి: వచ్చే ఏడాది రూ. లక్ష వరకు ఉన్న రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయని వ్యవసాయన శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతు ఆర్థికంగా ఎదగాలన్నదే కేసీఆర్ ఆశ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు అప్పులు చేసే పరిస్థితులు తగ్గిపోయాయన్నారు. సమయానికి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయని ఆయన తెలిపారు. పెట్టుబడి కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదన్నారు. కరోనా విపత్తు కారణంగా రైతుల రుణమాఫీ ఆలస్యమయింది వాస్తవమేనన్నారు. ఆర్థిక వనరుల లేమి కారణంగా ఇప్పటి వరకు రూ.36 వేల వరకు ఉన్న వారి రుణాలు మాఫీ అయ్యాయని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి