స్థానిక ఎన్నికల్లో ఉద్యోగులు పాల్గొనలేరు

ABN , First Publish Date - 2021-01-25T05:41:33+05:30 IST

కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగులు పాల్గొనలేరని ఏపీ ఎన్జీవోల సం ఘం జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి అన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఉద్యోగులు పాల్గొనలేరు

  1.  ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి


కర్నూలు (కల్చరల్‌), జనవరి 24: కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగులు పాల్గొనలేరని ఏపీ ఎన్జీవోల సం ఘం జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఏపీఎన్జీవోల సం ఘం నగర శాఖ అధ్యక్షుడు ఏంసీ కాశన్న అధ్యక్షతన ఎన్జీవో హోంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి హాజరై వివిధ అంశాలను చర్చించారు. ఇంతవరకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉద్యోగులకు వేయలేదన్నారు. కొవిడ్‌ వల్ల ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారని, వారికి ఇంతవరకు రూ.50 లక్షలు ఇన్స్యూరెన్స్‌ రాలేదని తెలిపారు. ఉద్యోగుల ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించలేమని, ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికల అంశంపై ఏపీ ఎన్జీవోల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఈనెల 27న సాయంత్రం 4 గంటలకు కర్నూలులోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో సమావే శం నిర్వహించనున్నారని తెలిపారు. నగరంలోని ఉద్యోగులంతా ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్జీవోల సంఘం నగర కార్యదర్శి పాండురంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, హరికృష్ణగౌడ్‌, నాగరాజు, సాయి రాం,  స్వరూప్‌, రామసుబ్బయ్య, సురేశ్‌, ప్రసాద్‌రెడ్డి, చలపతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T05:41:33+05:30 IST