పురపోరుకు కసరత్తు

ABN , First Publish Date - 2022-01-28T15:30:52+05:30 IST

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావటంతో అటు అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలు, ఇటు ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే, దాని మిత్రపక్షాలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి. గత ఆరునెలలుగా నగరపాలక ఎన్నికలు

పురపోరుకు కసరత్తు

- అన్ని పార్టీలవీ అవే పాట్లు

- జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపిక


చెన్నై: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావటంతో అటు అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలు, ఇటు ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే, దాని మిత్రపక్షాలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి. గత ఆరునెలలుగా నగరపాలక ఎన్నికలు ఎప్పుడు జరు గుతాయా అని ఎదురు చూసిన ప్రధాన పార్టీలు పలుమార్లు అభ్యర్థుల ఎంపికపై జిల్లా నాయకులతో సమీక్షలు కూడా జరిపాయి. ఆశావహుల నుంచి దరఖాస్తు లను కూడా స్వీకరించాయి. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాల్లో ప్రస్తుతం సవరణలు చేపడుతున్నాయి. ఇక కూటమిలోని మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులపైనే చర్చ జరగాల్సి ఉంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, డీపీఐ, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, మనిదనేయ మక్కల్‌ కట్చి, ముస్లింలీగ్‌ పార్టీలున్నాయి. అన్నాడీఎంకేలో బీజేపీ సహా చిన్న చితకా పార్టీలు న్నాయి. ఈ కూటమి నుంచి పీఎంకే వైదొలగింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు,  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ గురువారం పార్టీ జిల్లా నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. జిల్లాలా వారీగా స్థానిక నాయ కులు, పార్టీ సీనియర్‌ నేతల అభిప్రాయాలకు ప్రాధాన్య మిచ్చి గెలిచే అవకాశాలున్న వారినే అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచిం చారు. అదే సమ యంలో డీఎంకే కూటమి మిత్రపక్షమైన కాంగ్రెస్‌ నుంచి టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి నాయకత్వం లో ఆ పార్టీ బృందం స్టాలిన్‌తో చర్చలు జరుపనుంది.


వార్డుకు 40 మంది దరఖాస్తు...

అధికార డీఎంకేలో కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీకి వార్డుకు 30 నుంచి 40 మంది చొప్పున ఆశావహులు దరఖాస్తు చేసు కున్నారు. మున్సిపాలిటీల్లో  ఒక్కో వార్డుకు 10 నుంచి 20 దరఖాస్తులు వచ్చాయి. నగర పంచాయతీలోనూ వార్డుకు పదిమందికిపైగా ఆశావహులు దరఖాస్తులు పంపారని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. దక్షిణ చెన్నై జిల్లాలోని (చెన్నై కార్పొరేషన్‌) వార్డుల్లో పోటీకి దరఖాస్తు చేసిన ఆశావహులకు ఆ జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం గురువారం ఇంటర్వ్యూలు జరిపారు.


అన్నాడీఎంకే కూటమిలో...

అన్నాడీఎంకే కూటమిలో ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై మిత్రపక్షాల నాయకులతో, జిల్లా నాయకులతో చర్చలు జరిగాయి. పార్టీ ఉపసమ న్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం ఈ నాయకులతో చర్చలు జరిపారు. అన్నాడీఎంకే అభ్యర్థులు గెలిచే అవకాశాలున్న వార్డులపైనే ప్రధానంగా దృష్టిసారించాలని వారు జిల్లా కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉండగా అన్నాడీ ఎంకే కూటమిలో ప్రదాన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా ఇదివరకే నగరపాలక ఎన్నికల, అభ్యర్తుల ఎంపికపై పలు విడతలుగా జిల్లా స్థాయి నాయకులతో చర్చలు జరిపింది. పార్టీ అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షతన సీనియర్‌ నాయకుల సమావేశం కూడా జరిగింది. శుక్రవారం ఉదయం అభ్య ర్థుల ఎంపికపై అన్నామలై మరోమారు జిల్లా నాయకులు, పార్టీ సీనియర్‌ నాయకలుతో సమావేశం జరుపనున్నారు.  


అన్ని పార్టీలదీ అదే దారి..

ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి దినకరన్‌ నాయకత్వం లోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం కూడా సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలలో పోటీ చేసే విషయమై రాయపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా శాఖనాయకులతో దినకరన్‌ మంతనాలు కూడా జరిపారు. ఇక అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగిన పీఎంకే ప్రస్తుతం డీఎంకే కూటమిలో చేరేందుకు ఆసక్తికనబరు స్తోంది. ఆ పార్టీ నాయకులు నగరపాలక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటనలు చేస్తున్నా, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే మణి డీఎంకే నాయకులతో ఇటీవల రహస్యంగా చర్చలు జరిపారు. దీంతో పీఎంకే డీఎంకే కూటమిలో చేరుతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌నీది మయ్యం పార్టీ కూడా నగరపాలక ఎన్నికలకు ఎప్పుడో సిద్ధ మైంది. అదేవిధంగా సినీనటుడు విజయకాంత్‌ నాయకత్వంలోని డీఎండీకే  కూడా రెండు ప్రధాన కూటముల్లో చేరకుండా ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది.

Updated Date - 2022-01-28T15:30:52+05:30 IST