క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలి

ABN , First Publish Date - 2022-05-20T04:48:32+05:30 IST

రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదేశించారు.

క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలి
రాజాపూర్‌లో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

- కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు


మహబూబ్‌నగర్‌(కలెక్టరేట్‌), మే 19: రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదేశించారు. ఈ విషయమై గురువారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరం లో జిల్లా అధికారులు, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో సారి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను త్వర లోనే చేపట్టనున్న దృష్ట్యా జిల్లా, మండల అధికా రులు ఇందుకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ అన్నారు. ప్రతీ గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు తక్షణమే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ విష యమై తహసీల్దార్‌, ఎంపీడీవోలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా, ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు సంబంధించిన వివరాలను తక్షణ మే ఓపీఎంఎస్‌ చేయాలని, తద్వారా రైతులకు జా ప్యం లేకుండా వారి అకౌంట్‌లో డబ్బులు జమవు తాయని కలెక్టర్‌ చెప్పారు. ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని ఆయన తహసీల్దార్లను ఆదేశించారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపుల నాటే మొక్కలలో భాగంగా జిల్లా వ్యా ప్తంగా అన్ని రహదారులలో ఇదివరకే బహుళ వర సలలో మొక్కలు నాటినప్పటికి ఇంకా ఎక్కడైన మి గిలిపోయి ఉన్న, వరుసలు తక్కువ ఉన్న మొక్క లను నాటాలని ఆదేశించారు. మునిసిపల్‌, పట్టణ ప్రాంతాల్లో వైకుంఠధామాలు, వెజ్‌, నాన్‌వెజ్‌ మా ర్కెట్లు, పట్టణ ప్రకృతివనాలు వంటివి పూర్తి చే యాల్సినవన్ని పూర్తి చేయాలన్నారు. దళితబంధు కింద అన్ని విభాగాల యూనిట్లను తక్షణమే గ్రౌం డ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్థాని క సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవ ర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, జడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్‌డీవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎం పీడీవోలు, ఎంపీవోలు సమావేశానికి హాజరయ్యారు. 

 ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి

రాజాపూర్‌ : రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే ధాన్యం తడవకుండా అధికారులు చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. గన్నీ బ్యాగుల వివరాలపై ఆరా తీసి, తూకం విషయాలపై హమాలీలతో చర్చిం చారు. లారీ లోడుకు సరిపోను ధాన్యం వచ్చిన వెంటనే రైస్‌మిల్లులకు పంపాలని సూచించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ శంకర్‌, పీపీసీ ఇన్‌చార్జి శేఖర్‌, అధికారులున్నారు.

Updated Date - 2022-05-20T04:48:32+05:30 IST