ప్రాణవాయువుతో ప్రయాణం

ABN , First Publish Date - 2021-04-22T06:36:26+05:30 IST

ఎవరైనా ఊరెళ్లాలంటే

ప్రాణవాయువుతో ప్రయాణం

అడ్డగుట్ట, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా ఊరెళ్లాలంటే లగేజీతో వెళ్తారు. కానీ, ఓ ప్రయాణికుడు ఆక్సిజన్‌ వెంటబెట్టుకుని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. హౌరాకు చెందిన ఈ వ్యక్తి నగర శివారుల్లోని ఓ పారిశ్రామిక కంపెనీలో ఉద్యోగి. మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తారేమోనన్న భయంతో  అనారోగ్యంగా ఉన్నా ఇలా ఊరు బయలుదేరాడు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా రైలు ఎక్కేందుకు భార్య, లగేజీతో పాటు ప్రాణవాయివు (ఆక్సిజన్‌ బండ) తీసుకుని వచ్చాడు. లగేజీతోపాటు ఆక్సిజన్‌ బండను రైల్వే పోర్టర్‌ తీసుకెళ్తుండడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూశారు. 

Updated Date - 2021-04-22T06:36:26+05:30 IST