లాక్‎డౌన్ సంపూర్ణం

ABN , First Publish Date - 2022-01-10T15:54:09+05:30 IST

రాష్ట్రంలో ఆదివారం కఠిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ సంపూర్ణంగా అమలైంది. దీంతో జనజీవనం స్తంభించింది. చెన్నై, కోయంబత్తూరు, మదురై తదితర నగరాలు బోసిపోయి కనిపించాయి. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా...

లాక్‎డౌన్ సంపూర్ణం

రాష్ట్రం మొత్తం బంద్‌ 

రహదారులన్నీ నిర్మానుష్యం

స్తంభించిన జనజీవనం

డ్రోన్లతో నిఘా


చెన్నై: రాష్ట్రంలో ఆదివారం కఠిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ సంపూర్ణంగా అమలైంది. దీంతో జనజీవనం స్తంభించింది. చెన్నై, కోయంబత్తూరు, మదురై తదితర నగరాలు బోసిపోయి కనిపించాయి. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో అన్ని చోట్లా బంద్‌ దృశ్యాలే కనిపించాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధిస్తూ ఈ నెల 6వ తేదీ నుంచి రాత్రి  కర్ఫ్యూ అమలు చేస్తోంది. అదే సమయంలో కరోనా కేసులు  విపరీతంగా పెరిగాయి. శనివారం పాజిటివ్‌ కేసుల సంఖ్య పదివేలు దాటింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం కఠిన నిబంధనలతో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేశారు. గత మూడు రోజులుగా రాత్రి కర్ఫ్యూ అమలైన తర్వాత ఆదివారం వేకువజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ వాతావరణం ప్రారంభమైంది. ఇంచుమించు ఆరుమాసాల తర్వాత రాష్ట్రంలో కఠిన నిబంధనలతో మళ్ళీ సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేశారు. 


దుకాణాల మూత...

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కిరాణా దుకాణాల నుంచి పెద్ద సూపర్‌ మార్కెట్ల దాకా అన్నీ మూతపడ్డాయి. వాణిజ్య సంస్థలు, వస్త్ర, నగల దుకా ణాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు,  కాయగూరలు, చేపల మార్కెట్లు, మాంసం దుకాణాలు మూతపడ్డాయి. టి.నగర్‌, ప్యారీస్‌ కార్నర్‌, పురుష వాక్కం, విల్లివాక్కం, మైలాపూరు తదితర ప్రాంతాల్లోని ప్రముఖ నగల దుకాణాలు, వస్త్ర దుకాణాలు మూతపడటంతో ఆ ప్రాంతాలన్నీ జన సంచారం లేక బోసిపోయాయి.


రోడ్లన్నీ ఖాళీ...

నగరంలోని అన్నాసాలై, కామరాజర్‌  సాలై, రాజాజీ సాలై, పూందమల్లి హైరోడ్డు, కోయంబేడు వందడుగుల రోడ్డు, పాతమహాబలిపురం రోడ్డు, ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు తదితర ప్రధాన రహదారుల్లో వాహనాల సంచారం పూర్తిగా స్తంభించడంతో ఈ రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.  కోయం బత్తూరు, మదురై, తిరుచ్చి, తంజావూరు, కడలూరు, వేలూరు, తిరువ ణ్ణామలై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, చెంగల్పట్టు తదితర నగరాల్లో ఎల్లప్పుడూ వాహనాలు, జనసంచారంతో కనిపించే ప్రధాన రహ దారులు ఖాళీగా కనిపించాయి. అంబులెన్సులు, పోలీసు వాహనాలు, ఆస్పత్రి సిబ్బంది వాహనాలు మాత్రమే తిరిగాయి. ఆదివారం ఉదయం ఆరు గుంటల నుంచే ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సంస్థల బస్‌సర్వీసులను రద్దు చేశారు.  


ఇళ్లకే పరిమితం...

రాఫ్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలు ఇళ్ళలోనే గడిపారు. నగరంలోని రాయ పేట, రాయపురం, మైలాపూరు, ట్రిప్లికేన్‌, అడయార్‌, సైదాపేట, కోడంబాక్కం, వడపళని, పూందమల్లి, మధురవాయల్‌, అమింజికరై, ప్యారీస్‌ కార్నర్‌, బ్రాడ్వే, పట్టినంబాక్కం, మందవెల్లి, పోరూరు, గిండీ, వేళచ్చేరి తదితర ప్రాంతాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. ఎల్లప్పు డూ జనంతో కిక్కిరిసి ఉండే టి. నగర్‌ రంగనాఽథన్‌వీధి కొద్ది నెలల తర్వాత నిర్మానుష్యంగా మారింది. 


విధుల్లో 15వేల మంది పోలీసులు...

నగరంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు చేయడానికి 15 వేల మంది పోలీసులను నియమించారు.. నగరమంతటా వాహనాలు సంచ రిం చకుండా ట్రాఫిక్‌ పోలీసులు సిగ్నల్స్‌ వద్ద నిఘా పెంచారు. ఆస్పత్రులు, పెట్రోల్‌ బంకుల సిబ్బంది, పాత్రికేయులు, పాలు పంపిణీ చేసేవారు మాత్రమే బయట తిరిగేందుకు అనుమతించారు. పలువురిని గుర్తింపు కార్డులు చూపిన తర్వాతే వాహనాల్లో వెళ్లేందుకు అనుమతించారు. ఆటోలు, షేర్‌ఆటోలు, టాక్సీలు నడువలేదు. రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌ సమీప ప్రాంతా ల్లోనే స్వల్ప సంఖ్యలో ఆటోలు నడిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి సుమారు లక్షమంది పోలీసులు చర్యలు తీసుకున్నారు.  


పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ ...

నగరంలో లాక్‌డౌన్‌ అమలుపై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ప్రధాన రహదారుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడూ పరిశీలించారు. ట్రాఫిక్‌ పోలీసులు లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపై తిరిగే వాహనాలు, జనాలను గుర్తించేం దుకు డ్రోన్లను ఉపయోగించారు.  తాంబరం, ఆవడి కమిషనర్లు రవి, సదీప్‌రాయ్‌ రాథోడ్‌ కూడా ఆయా ప్రాంతాల్లో జనసంచారాన్ని, వాహ న సంచారాన్ని కట్టడిచేసేందుకు చర్యలు చేపట్టా రు. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి, కోయంబత్తూరు, సేలం సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు వాహన తనిఖీలను   నిర్వహించి అనవసరంగా సంచరించే వాహనాలను స్వాధీ నం చేసుకుని కేసులు నమోదు చేశారు.

Updated Date - 2022-01-10T15:54:09+05:30 IST