రైతు భరోసా కేంద్రానికి తాళం

ABN , First Publish Date - 2022-06-25T05:39:12+05:30 IST

అద్దె చెల్లించడం లేదని రైతు భరోసా కేంద్రాల భవనాలకు యజమానులు తాళాలు వేశారు.

రైతు భరోసా కేంద్రానికి తాళం
బ్రాహ్మణకొట్కూరు రైతు భరోసా కేంద్రానికి తాళం వేసిన దృశ్యం

అద్దె చెల్లించడం లేదని..


నందికొట్కూరు రూరల్‌, జూన్‌ 24 : అద్దె చెల్లించడం లేదని రైతు భరోసా కేంద్రాల భవనాలకు యజమానులు తాళాలు వేశారు. నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరు, దామగట్ల, వడ్డెమాను అల్లూరు, కోనేటమ్మపల్లి గ్రామాలలో సంవత్సరం నుంచి రైతు భరోసా కేంద్రాలను నిర్వహిస్తున్న భవనాలకు అద్దె చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాలకు సొంత భవనాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలేదు. దీంతో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గత సంత్సరం నుంచి అద్దెలు చెల్లిండం లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీంతో యజమానులు తాళాలు వేశారు. వ్యవసాయ కార్మికసంఘం జిల్లా నాయకులు పక్కీర్‌సాహెబ్‌ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ కేంద్రాల ముందు ధర్నా నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి శ్రావణిని వివరణ కోరగా.. గత 8 నెలల నుంచి బిల్లులు రావడం లేదని, ప్రభుత్వానికి బిల్లులు పెట్టామని తెలిపారు. 

Updated Date - 2022-06-25T05:39:12+05:30 IST