కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-11T18:07:23+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించడంలో పోలీసులు దాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీంతో బళ్లారి నగరం నిర్మానుష్యంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి రైలులో వచ్చిన ప్రయాణికులకు

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌


బళ్లారి(కర్ణాటక): రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించడంలో పోలీసులు దాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీంతో బళ్లారి నగరం నిర్మానుష్యంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి రైలులో వచ్చిన ప్రయాణికులకు ఆటో, ట్యాక్సీ సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేరేదారి లేక ప్రయాణికులు వారి ఇళ్లకు మండుటెండలో నడుచుకుంటూ వెళ్తున్నారు. నగరంలో అనవసరంగా రోడ్లపై తిరిగేవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. చిరు వ్యాపారులకు వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా భిక్షాటన చేసేవారు, అనాథలకు ఒక్కపూట గడవటమే కష్టంగా మారింది. కొందరు భిక్షకులు రైల్వేస్టేషన్‌, బస్‌ స్టేషన్‌ల వద్ద తిండి కోసం అలమటిస్తున్నారు. 

 

లాక్‌డౌన్‌కు సహకరించండి : కలెక్టర్‌ 

బళ్లారి జిల్లాలో కొవిడ్‌ కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిం చాలని కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలపాటి ఒక ప్రకటనలో కోరారు. సోమవారం నుంచి ఈనెల 24వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని, కేటాయించిన సమయంలో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.  నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

  

కంప్లిలో 60 బైక్‌లు సీజ్‌  

కంప్లి : లాక్‌డౌన్‌ మొదటిరోజైన సోమవారం అనవసరంగా కంప్లి పట్టణంలో బయట తిరుగుతున్న 60 ద్విచక్రవాహనాలను సీఐ సురేష్‌ తల్వార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ బసప్ప లంబాణి, ఏఎ్‌సఐ పరశురామప్ప, అగురప్ప, పోలీసు సిబ్బంది  సీజ్‌ చేశారు. వీటిని పట్టణంలోని భారతీయ శిశువిద్యాలయం ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఉంచారు. కంప్లి పట్టణంలో రోడ్లపైకి ఏ ద్విచక్రవాహనం వచ్చినా   సీజ్‌ చేస్తున్నారు. 14 రోజుల అనంతరం ఈ వాహనాలకు జరిమానా విధించి అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ నెల 24వ తేదీ వరకు లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.  

అనవసరంగా బయటకు రావద్దు : సీఐ

  ఇకపై ఎవరూ అనవసరంగా బయటకు రారాదని  సీఐ సురేష్‌ తల్వార్‌  హెచ్చరించారు. కార్లలో బయటకు వచ్చిన వారికి వార్నింగ్‌ ఇచ్చాడు. ఇచ్చిన సమయం తర్వాత వ్యాపారాలు చేస్తున్న అంగళ్లపై దాడి చేశారు. విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 

ఇబ్బందుల్లో ప్రజలు

సిరుగుప్ప : సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ఇంతకుముం దు జనతా కర్ఫ్యూ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కా యగూరలు, నిత్యవసర వస్తువుల సరుకులు కొనుగోలుకు, ఇతర వ్యాపారాలకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ జనతా కర్ఫ్యూ విఫలం కావడంతో మరళా సం పూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఉద యం 9 గంటల వరకు యథావిధిగా ని త్యవసర వస్తువుల కొనుగోలుకు ప్రభు త్వం అవకాశమిచ్చింది. అనంతరం 10 గంటల నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌ అమ లు చేస్తోంది. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.  


బోసిపోయిన గంగావతి

గంగావతి రూరల్‌ : కొవిడ్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం నుంచి గంగావతి పట్టణంలో లాక్‌డౌన్‌ విధించారు. ఈ కారణంగా గంగావతి పట్టణంలోని ప్రధాన సర్కిళ్ళు నిర్మానుష్యంగా మారా యి. నిత్యావసర వస్తువుల కోసం ఉద యం 6గంటల నుంచి 9గంటల వరకు అనుమతి ఇవ్వడంతో ఉ దయం నుంచే పట్టణ ప్రజలు వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులను పోలీసులు అ డ్డుకుని మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డివైఎస్పీ రుద్రేష్‌ కొప్ప తెలిపారు. 


రాయచూరు నిర్మానుష్యం..

రాయచూరు: కరోనా కట్టడికి జిల్లాలో అధికారులు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేశారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు ప్రధాన రోడ్డు కూడళ్లు, బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌ తదితర చోట్ల దుకాణాలన్నీ మూసివేయడంతో నగరమంత బోసిపోయినట్లు కనిపించింది. ప్రధాన రోడ్డు కూడళ్లన్ని జన సంచారం లేకా వెలవెలబోయాయి.                          

Updated Date - 2021-05-11T18:07:23+05:30 IST