లాక్‌డౌన్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సర్వే.. ఫలితాలివే!

Jun 16 2021 @ 16:40PM

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు చేస్తున్నా.. అదే అన్నిటికి పరిష్కారం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతుందని వాపోతున్నారు. అయితే కరోనా వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని సడలింపులిస్తున్నా.. చాలా మంది ఇళ్లకే పరిమితమవ్వడం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తీయాలా... కొనసాగించాలా అనే దానిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది. 


తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగించాలా? తీసేయాలా? అని అడగ్గా 77శాతం మంది కొనసాగించాలని పేర్కొన్నారు. 23శాతం మంది తీసేయాలని ఓటేశారు. ఇప్పుడున్న సడలింపు సమయం సరిపోతుందా? లేక ఇంకా సమయం పెంచాలా? అని అడగ్గా 28 శాతం పెంచాలని, ఇంకా స్ట్రిక్ట్ చేయాలని 25శాతం మంది, సరిపోతుందని 45శాతం మంది అన్నారు. లాక్‌డౌన్ వల్లే కేసులు తగ్గుముఖం పట్టాయా? అని అడగ్గా 78శాతం అవునని, 14శాతం మంది అదేం కాదని, 8శాతం చెప్పలేమన్నారు.   

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...