లింగంపేట, కిష్టాపూర్‌లో లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-18T04:37:18+05:30 IST

లింగంపేటలో ఆదివారం స్వచ్ఛ ందంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సర్పంచ్‌ లావణ్య శనివారం తెలిపారు. కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

లింగంపేట, కిష్టాపూర్‌లో లాక్‌డౌన్‌

లింగంపేట, ఏప్రిల్‌ 17: లింగంపేటలో ఆదివారం స్వచ్ఛ ందంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సర్పంచ్‌ లావణ్య శనివారం తెలిపారు. కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు తిరగవద్దన్నారు. తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌ ఆధ్వర్యంలో రోడ్లపై మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న ఆరుగు రికి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. మండలంలో కరోనా పాజిటివ్‌ ఉన్నవారు సైతం రోడ్లపై తిరుగుతున్నారని కొందరు ఫిర్యాదు చేయడంతో వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుబ సభ్యులకు అవగాహన కల్పించారు. మండ ల కేంద్రంలోని ఎన్‌డీసీసీ బ్యాంక్‌, ఐఓబీ బ్యాంక్‌, పోస్టాఫీసు, కిరాణా దుకాణాలు, హోటల్స్‌, బట్టల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది తప్పని సరిగా మాస్కులు ధరించాల ని, భౌతిక దూరం పాటించాలని, శానిటేజర్లు ఏర్పాటు చేయా లని కస్టమర్లను సైతం మాస్కులేకుండా లోనికి అనుమతించ వద్దని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని తెలియజేశారు. మండలంలో ఇప్పటికి 150 వరకు యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. శని వారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 12 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సమీనా సుల్తానా తెలిపారు. మండలంలోని ముంబాజిపేటలో 4, లింగంపేటలో 2, శెట్పల్లితండాలో 1, ముస్తాపూర్‌లో 1, నల్ల మడుగులో 1, పోల్కంపేటలో 1, పోలీసు స్టేషన్‌లో 1, కేసులు వచ్చినట్లు ఆమె తెలిపారు. కరోనా ఉధృతంగా పెరుగుతుం డంతో ఆదివారం లింగంపేటలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటి స్తున్నట్లు సర్పంచ్‌ లావణ్య తెలిపారు. కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శి రవీందర్‌రావు ఉన్నారు.
రేపటి నుంచి కిష్టాపూర్‌లో..
బీర్కూర్‌: కరోనా కేసులు పెరుగుతున్న దష్ట్యా కరోనాను కట్టడి చేసేందుకు బీర్కూర్‌ మండలంలోని ఒక్కొక్క గ్రామం లో తాత్కాలిక లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు సర్పంచ్‌ పుల్లెన్‌ బాబురావు అధ్యక్షతన శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సోమవారం నుంచి కరోనా కట్టడి అయ్యేంత వరకు గ్రామం లో తాత్కాలిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తీర్మానించారు. గ్రామం లోని దుకాణాలు, హోటళ్లు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాల న్నారు. ఎవరైనా కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానా విధిస్తామన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకో వాలని కోరారు.

Updated Date - 2021-04-18T04:37:18+05:30 IST