దుర్గా పూజ తర్వాత బెంగాల్ పట్టణంలో మళ్లీ కరోనా Lockdown

ABN , First Publish Date - 2021-10-27T16:32:54+05:30 IST

దుర్గా పూజ తర్వాత పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌ పట్టణంలో కొవిడ్ -19 కేసుల సంఖ్య పెరిగింది...

దుర్గా పూజ తర్వాత బెంగాల్ పట్టణంలో మళ్లీ కరోనా Lockdown

సోనార్‌పూర్: దుర్గా పూజ తర్వాత పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌ పట్టణంలో కొవిడ్ -19 కేసుల సంఖ్య పెరిగింది. దీంతో సోనార్‌పూర్ మునిసిపాలిటీ ప్రాంతంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ మున్సిపాలిటీ ఉత్తర్వులు జారీ చేసింది.సోనార్‌పూర్ ప్రాంతంలో ఇప్పటివరకు 19 కంటైన్‌మెంట్ జోన్‌లు ఉన్నాయి.లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలు మాత్రమే పనిచేయడానికి అనుమతిస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు.సోనార్‌పూర్ పట్ణణం రాజధాని కోల్‌కతా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.దుర్గాపూజ ఉత్సవాల తర్వాత రాష్ట్రంలో కొవిడ్ -19 కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది.


దుర్గా పూజ అనంతరం కోల్‌కతా నగరంలో కరోనా కేసులు 25 శాతం పెరిగాయని లేఖలో ఐసీఎంఆర్ పేర్కొంది. గత 24 గంటల్లో కోల్‌కతాలో మాత్రమే 248 కరోనా కేసులు నమోదైనాయి.కరోనాతో ఆరుగురు మరణించారు.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కొవిడ్ -19 కొత్త కేసులు టీకాలు వేసిన వారిలో ఎక్కువగా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.కొవిడ్ కేసులు,కరోనా మరణాలను తక్షణమే సమీక్షించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. 

Updated Date - 2021-10-27T16:32:54+05:30 IST