తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్

ABN , First Publish Date - 2021-05-11T19:57:05+05:30 IST

లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది.

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్

హైదరాబాద్: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. పది తర్వాత మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు జన సంచారంపై కఠిన నియంత్రణలు ఉంటాయి. మరోవైపు టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.


తెలంగాణ హైకోర్టుతో సహా పలువురు లాక్‌డౌన్ విధించడమే సరైన మార్గమని చెబుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో తాజా కేబినెట్ భేటీలో లాక్‌డౌన్ వైపు మొగ్గు చూపారు.  



Updated Date - 2021-05-11T19:57:05+05:30 IST