మాట్లాడుతున్న అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం, పక్కన డీసీఆర్‌బీ డీఎస్పీ శ్రీనివాసరావు
గుంటూరు, డిసెంబరు 2: జాతీయలోక్ అదాలత్‌లో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ గంగాధరం అన్నారు. బుధవారం ఆయన పోలీస్ కార్యాలయంలోని గ్రీవెన్స్ భవన్‌లో కోర్టు కానిస్టేబుళ్ళతో సమావేశమయ్యారు. ఈ నెల 12న జరిగే జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో అర్బన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారమయ్యేలా తగుచర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత సమాచారాన్ని వెంటనే డీసీఆర్‌బీకి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఎంఎస్ ఎస్‌ఐ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.