లోక్‌సభ, రాజ్యసభ శీతాకాల సమావేశాల్లో Visitors కు అనుమతి లేదు

ABN , First Publish Date - 2021-11-26T13:25:23+05:30 IST

లోక్‌సభ, రాజ్యసభ శీతాకాల సమావేశాల్లో సందర్శకులకు అనుమతి లేదని పార్లమెంటు కార్యాలయం ప్రకటించింది....

లోక్‌సభ, రాజ్యసభ శీతాకాల సమావేశాల్లో Visitors కు అనుమతి లేదు

న్యూఢిల్లీ : లోక్‌సభ, రాజ్యసభ శీతాకాల సమావేశాల్లో సందర్శకులకు అనుమతి లేదని పార్లమెంటు కార్యాలయం ప్రకటించింది.నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల్లో సందర్శకులు ఎవరూ ఉండరని పార్లమెంటు వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు, విధించిన పరిమితుల కారణంగా రాబోయే సెషన్‌లో రెండు సభలలోని సందర్శకుల గ్యాలరీలు మూసివేయాలని నిర్ణయించారు.వచ్చే సెషన్‌లో సందర్శకులకు గ్యాలరీలు అందుబాటులో లేవని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌ల అధికారులు లేఖ రాశారు.సెషన్‌లో కోవిడ్ ప్రోటోకాల్ అమలులో ఉన్నందున ఉభయ సభలలోని సందర్శకుల కోసం ఉద్దేశించిన గ్యాలరీలలో ఎంపీలను కూర్చోబెడతామని పార్లమెంటు వర్గాలు తెలిపాయి.


అధికారిక సర్క్యులర్ ప్రకారం లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సీటింగ్ అమరిక ఛాంబర్, గ్యాలరీలలో అస్థిరమైన పద్ధతిలో చేశారు.‘‘లోక్‌సభ, రాజ్యసభ సెషన్ సమయంలో సభా కార్యకలాపాలను చూసేందుకు సందర్శకులను అనుమతించం, సెషన్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ పాస్ జారీ చేయం’’ అని పార్లమెంటు అధికారులు జారీ చేసిన సర్క్యులర్ లో పేర్కొంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబరు 29 వతేదీ నుంచి డిసెంబర్ 23వతేదీ వరకు కొనసాగనున్నాయి.

Updated Date - 2021-11-26T13:25:23+05:30 IST