లోక్‌అదాలత్‌ ద్వారా ఉచిత న్యాయం

ABN , First Publish Date - 2021-09-18T03:29:38+05:30 IST

లోక్‌అదాలత్‌ ద్వారా ఉచితంగా న్యాయం పొందే అవకాశం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌.శ్రీనివాసులు నాయక్‌ వెల్లడించారు.

లోక్‌అదాలత్‌ ద్వారా ఉచిత న్యాయం
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులునాయక్‌

 సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులునాయక్‌


తోటపల్లిగూడూరు, సెప్టెంబరు 17 : లోక్‌అదాలత్‌ ద్వారా ఉచితంగా న్యాయం పొందే అవకాశం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌.శ్రీనివాసులు నాయక్‌ వెల్లడించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుమారి సి.యామిని పర్యవేక్షణలో మండలంలోని వరిగొండ పంచాయతీ మజరా రావూరువారికండ్రిగ ఎస్టీ కాలనీలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా పరిష్కారానికి నోచుకోని సమస్యలను లోక్‌అదాలత్‌ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, పిల్లల సంరక్షణ కోసం 1098 అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి మాట్లాడుతూ దిశా యాప్‌ను ప్రతి ఒక్కరు తమ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో  ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌ ఈగ సుబ్బరత్నమ్మ, డిప్యూటీ తహసీల్దారు ఆనందరావు, అసిస్టెంట్‌ ట్రైబల్‌ ఆఫీసర్‌ అంకయ్య, పీఎల్‌వి. మానికల సుధాకర్‌, పెసల వేణుగోపాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరగిరి వెంకటప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-18T03:29:38+05:30 IST