డీపీవోపై లోకాయుక్త ఆగ్రహం

ABN , First Publish Date - 2021-04-22T05:30:00+05:30 IST

రహదారి ఆక్రమణ జరిగిందని లోకాయుక్తలో ఫిర్యాదుపై విచారణ నిర్వహించారు.

డీపీవోపై లోకాయుక్త ఆగ్రహం

రహదారి ఆక్రమణ ఫిర్యాదు విచారణకు హాజరుకావాలని ఆదేశం



ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 22 : రహదారి ఆక్రమణ జరిగిందని లోకాయుక్తలో ఫిర్యాదుపై విచారణ నిర్వహించారు. సరైన చర్యలు తీసుకోకపోవడంతోపాటు విచారణకు రాకపోవడంతో జిల్లా పంచాయతీ అధికారిపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. శనివారపుపేట పంచాయతీ విద్యానగర్‌కు చెందిన మీసాల శ్రీనివాస్‌ గాంధీ బొమ్మ రోడ్డు ఎదురుగా పంచాయతీ మాస్టర్‌ రోడ్డు ఆక్రమణకు గురైందని 2017లో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అంతకుముందు పంచాయతీ అధికారులు, అప్పటి కలెక్టర్‌ తదితరులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో లోకాయుక్తను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అప్పటి డీపీవోను ఆదేశిం చారు. గతంలో ఫిర్యాదుదారుడిని శనివారపుపేట పంచాయతీ అధికారులను విచారించినా ఎక్కడా రోడ్లు ఆక్రమణకు గురికాలేదని లోకాయుక్తకు నివేదించారు. ఫిర్యాదుదారుడు విచారణలో డీటీసీపీ ప్లానింగ్‌ అధికారి, తహసీల్దార్‌ ఇచ్చిన లే అవుట్‌ ప్లాన్‌ను సమర్ధించారు. వాటి ద్వారా ఆక్రమణ జరిగిందని లోకాయుక్త గుర్తించి మరోసారి విచారణకు ఆదేశించారు. పంచాయతీ అధికారులు, ఫిర్యాదు దారుడైన శ్రీనివాసరావును విచారించి ఆక్రమణ అంశంపై పూర్తి నివేదిక అందజే శారు. చర్యలు తీసుకోవడంలో పంచాయతీ అధికారులు విఫలం అయ్యారు. దీనిపై తదుపరి విచారణకు డీపీవో స్వయంగా హాజరుకావాలని లోకాయుక్త ఆదేశించింది.

Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST