ఇప్పుడు పిల్లలు 'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారు: లోకేష్

ABN , First Publish Date - 2021-05-09T17:14:10+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు పిల్లలు 'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారు: లోకేష్

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతి ఒక్కరూ తల్లి విలువ తెలుసుకునేలా, ప్రతి ఒక్కరికీ తల్లిపట్ల గౌరవం పెంచేలా 'అమ్మకు వందనం' పేరిట గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించిందన్నారు. ఇప్పుడు అదే పిల్లలు  'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలలో వైద్యం అవసరం అయితే అంబులెన్స్‌లు వెళ్ళేవని, కానీ నిన్నగాక మొన్న విశాఖ జిల్లా పాడేరు మండలంలో గర్భిణీని కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చిందన్నారు. అరకు మండలంలో ఒక గర్భిణిని రెండు కిలోమీటర్లు నడిపించాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి అని ఈ చేత్తో ఇచ్చి, ఆ అమ్మ చేతి నుంచే నాన్న బుడ్డీకి లాక్కుంటుంటే కుటుంబాన్ని నడపలేక అమ్మకు ఎంత యాతన అని అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇక నుంచైనా తల్లుల ఇబ్బందుల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానని, మాతృమూర్తులందరికీ పాదాభివందనమని లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-09T17:14:10+05:30 IST