
అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై మోసపు రెడ్డి కుట్రలకు అంతే లేదని అన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి భూకంపం ప్రమాదం, ముంపు ముప్పు ఉందని ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని శ్మశానం అన్నారు.. నేడు ఎకరం రూ. 10 కోట్లకు అమ్మకానికి పెట్టారు.. అమ్మ లాంటి అమరావతిపై జగన్ కుట్రలకు అంతే లేదని మరోసారి నారా లోకేష్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి