ధూళిపాళ్ల అరెస్ట్ అప్రజాస్వామికం: Lokesh

ABN , First Publish Date - 2022-06-20T21:33:44+05:30 IST

దోపిడీని ప్రశ్నించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీమంత్రి లోకేశ్‌ తప్పుబట్టారు.

ధూళిపాళ్ల అరెస్ట్ అప్రజాస్వామికం: Lokesh

అమరావతి: దోపిడీని ప్రశ్నించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీమంత్రి లోకేశ్‌ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధూళిపాళ్లపై దాడి, అరెస్ట్‌ల వెనక మట్టి మాఫియా ఉందని ఆరోపించారు. వైసీపీ ఒక్క చాన్సే చివరిదని ఆ పార్టీ నేతలకు అర్థమైందన్నారు. అందుకే అన్ని విధాలా దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో మట్టి, గ్రావెల్ మాఫియాకు వైసీపీ అండదండలున్నాయని లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో ధూళిపాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ 'చలో అనుమర్లపూడి'కి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. టీడీపీ చలో అనుమర్లపూడికి టీడీపీ నేతలను పోలీసులు అనుమతిలేదని అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. 

Updated Date - 2022-06-20T21:33:44+05:30 IST