Vikram : సూర్యని కన్ఫర్మ్ చేసిన దర్శకుడు

Published: Thu, 19 May 2022 10:10:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Vikram : సూర్యని కన్ఫర్మ్ చేసిన దర్శకుడు

విశ్వనటుడు కమల్‌హాసన్ (Kamal hasan), టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj)  కలయికలో వస్తున్న తమిళ థ్రిల్లర్ ‘విక్రమ్’ (Vikram). ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న లోకేష్ మూడో ప్రయత్నంగా కమల్‌తో ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay sethupathi), మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) కీలక పాత్రలు పోషిస్తుండగా.. నరేన్, అర్జున్ దాస్, హరీశ్ ఉత్తమన్, చంబన్ వినోద్ జోస్, ఆంటోనీ వర్గీస్, గాయత్రీ శంకర్, షాన్వీ శ్రీవాత్సవ, శివానీ నారాయణన్, రమేశ్ తిలక్, అరుళ్ దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్రం ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమా తమిళ వెర్షన్ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్‌కు ఓ రేంజ్‌‌లో రెస్పాన్స్ వచ్చింది. 

కమల్‌హాసన్ (Kamal hasan), విజయ్ సేతుపతి (Vijay sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) లాంటి మహామహులైన నటులు ఉండడంతో ‘విక్రమ్’ (Vikram) చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే వీరితో పాటు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మరో స్టార్‌ను కూడా దర్శకుడు కన్ఫర్మ్ చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. అతడు మరెవరో కాదు.. సూర్య (Surya). ఇది వరకు దీనిపై వార్తలొచ్చాయి. కానీ ఇంతవరకూ అది రూమర్ గానే చెలామణి అయింది. అయితే ట్రైలర్ లో కొన్ని సూర్య షాట్స్ చూసి ప్రేక్షకులు బాగా ఎగ్జైట్ అయ్యారు.  తాజాగా విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విక్రమ్ చిత్రంలోకి సూర్యని ఆహ్వానిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించాడు. ఇందులో సూర్య ఎక్స్టెండెడ్ క్యామియో (extended cameo) రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

‘విక్రమ్’ (Vikram) వరల్డ్ లోకి సూర్య (Surya) ని ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ దర్శకుడు లోకేష్ ట్విట్టర్ లో తెలుపుతూ..  ఆయనతో విక్రమ్ (Vikram) టీమ్ దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇంతకు ముందు సూర్య తమ్ముడు కార్తి (Karthi) తో లోకేష్ కనగరాజ్ తీసిన ‘ఖైదీ’ (Khaidi) చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. మరి ఈ సినిమాకి సూర్య రాకతో ఇంకెంత వెయిట్ పెరుగుతుందో చూడాలి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International