Viral Video: జుట్టుకు తాడును కట్టుకుని వ్యాన్‌ను లాగేందుకు ప్రయత్నించిన మహిళ.. ఏం జరిగిందో మీరే చూడండి

ABN , First Publish Date - 2021-10-12T18:31:51+05:30 IST

లండన్‌కు చెందిన మహిళకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చర్కర్లు కొడుతోంది. దీంతో ఆమె వీడియోను చూసి, నెటిజన్లు ఇతరులకు షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ‘నవ్వు

Viral Video: జుట్టుకు తాడును కట్టుకుని వ్యాన్‌ను లాగేందుకు ప్రయత్నించిన మహిళ.. ఏం జరిగిందో మీరే చూడండి

ఇంటర్నెట్ డెస్క్: లండన్‌కు చెందిన మహిళకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చర్కర్లు కొడుతోంది. దీంతో ఆమె వీడియోను చూసి, నెటిజన్లు ఇతరులకు షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ‘నవ్వు ఏం షాంపూ వాడతావో కొంచెం మాకు కూడా చెప్పమ్మా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ వీడియోలో ఏం ఉందనే విషయంలోకి వెళితే..



బ్రిటన్‌ను ట్రక్కు డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ఇంధన సంక్షోభం ఏర్పడింది. దీంతో పెట్రోల్ కోసం ప్రజలు రోడ్లపై బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపట్ల అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ చేసిన పని నెట్టింట వైరల్ అయింది. తాజాగా సెంట్రల్ లండన్‌కు చెందిన ఓ మహిళ ఇంధన సంక్షోభం దృష్ట్యా వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది. 



తాడు సహాయంతో ఓ భారీ వ్యాన్‌ను తన జుట్టుకు కట్టేసుకుని దాన్ని పెట్రోల్ బంకు వరకూ లాక్కెళ్లింది. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నీ కురులు అంత బలంగా ఉండటానికి నువ్వేం చేస్తావు. ఏం షాంపూ వాడుతావు. ఆ షాంపూ పేరు మాకు కూడా చెప్పొచ్చుగా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 





Updated Date - 2021-10-12T18:31:51+05:30 IST