ఫీజుల వసూళ్లపై నజర్‌!

ABN , First Publish Date - 2021-05-09T05:28:41+05:30 IST

జిల్లా ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల వసూళ్ల దందాపై నేడు చ ర్యలు చేపట్టే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్యశాఖ, టాస్క్‌ పోర్సు, మానిటరీ కమిటీలు ఇచ్చిన నివేదికలపై కలెక్టర్‌ సమీక్షించనున్నారు.

ఫీజుల వసూళ్లపై నజర్‌!

టాస్క్‌పోర్సు, మానిటరింగ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక పై

నేడు అధికారులతో కలెక్టర్‌ సమావేశం

నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లపై చర్యలు చేపట్టే అవకాశం


నిజామాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల వసూళ్ల దందాపై నేడు చ ర్యలు చేపట్టే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్యశాఖ, టాస్క్‌ పోర్సు, మానిటరీ కమిటీలు ఇచ్చిన నివేదికలపై కలెక్టర్‌ సమీక్షించనున్నారు. నివేదిక ఆధారంగా ఫీజుల దోపిడికి పాల్పడిన ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఇతర చర్యలు చేపట్టనున్నారు. అవసరమైతే కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో కొవిడ్‌ తీవ్రత పెరగడంతో గత నెలలో ప్రై వేటు నర్సింగ్‌హోంలు, ఆసుపత్రులకు చికిత్స కోసం అను మతులు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖా స్తు చేసుకున్న 56 ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఈ ఆసుపత్రుల లో కొవిడ్‌ సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వం నిర్ణ యించిన విధంగా ఫీజులు వసూలు చేయాలని కోరారు. ప్రతి ఆ సుపత్రిలో కొవిడ్‌కు సంబంధించిన ఫీజుల వివరాలు తెలి పే విధంగా ఫ్లెక్సీలు పెట్టాలని కోరారు. అన్ని ఆసుపత్రు ల్లో కొవిడ్‌ సేవలు అందే విధంగా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను ఏ ప్రైవేటు ఆసుపత్రి పాటించ లేదు. ఫీజుల వివరాలను తెలిపే బోర్డులను పెట్టలే దు. కొవిడ్‌ తీవ్రత పెరగడం, ఎక్కువ మంది చికిత్స కోసం ప్రైవేటు ఆసుప త్రులకు వస్తుండంతో ఫీజులను పెంచా రు. ప్యాకేజీల పేరున ఐ దు నుంచి వారం రోజుల వరకు  రోజుకు రూ.30 వేలకు పైగా ఫీజులు వసూలు చేశారు. ప్యాకేజీలు అయితే లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తీ సుకున్నారు. ఇవే కాకుండా అత్యవ సరం పేరునా రె మిడెసివీర్‌ బ్లాక్‌ చేసి మూడున్న వేలు ఉన్న ఈ ఇంజ క్షన్‌ను ముప్పైవేలకు పైగా అమ్మకాలు చేశారు. ఈ ఇంజ క్షన్ల కృత్రిమ కొరత సృష్టించారు. ఇవే కాకుండా పరీక్షల పేరున ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా రు. ఎలాంటి అనుమతులు లేకుండానే పరీక్షలు చేస్తు న్నారు. కొన్ని ల్యాబ్‌లకు అనుమతులు ఉన్న దేనిలో ప్ర భుత్వ రేట్ల ప్రకారం ఫీజులు తీసుకోవడం లేదు. ఆసుప త్రులతో పాటు ల్యాబ్‌లలో ఎక్కువ ఫీజులు తీసుకుని తెల్ల కాగితాలపై బిల్లులను ఇచ్చారు.

కొవిడ్‌ చికిత్స పేరున ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌ల దోపిడీపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో కలెక్టర్‌ స్పందించారు. ప్రత్యేకంగా జిల్లాస్థాయి అధికారులతో టా స్క్‌పోర్సు, మానిటరింగ్‌ కమిటీలను నియమించారు. వీటి తో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేశా రు. రెమ్‌డెసివీర్‌ ఇంజక్షన్లు పక్కదారి పట్టించిన ఆరు ఆ సుపత్రులకు నోటీసులు జారీచేశారు. పూర్తి నివే దికను కలెక్టర్‌ నారాయణరెడ్డికి అందజేశారు. ఈ నివేది కలలో ఫీజుల వసూలు, ఇతర అంశాలను పొందు పరి చారు. వీటిపైన ఆదివారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకో నున్నారు. ఫీజుల వసూళ్లతో పాటు అనుమతులు లేని ల్యాబ్‌లపైన చర్యలు తీసుకునే అంశం చర్చించ నునున్నా రు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశం ఉన్నదని తెలియడం తో శనివారం సాయంత్రం చాల ఆసుపత్రుల్లో ఫీజుల లి స్టు డిస్‌ప్లే చేసి ఆ ఫొటోలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽ దికారి కార్యాలయానికి పంపించారు. కొన్ని ఆసుపత్రుల యజమాన్యాలు తమపై చర్యలు చేపట్టకుండా ఉండేం దుకు ప్రజా ప్రతినిధులతో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోం ది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌పోర్సు నివేదికపై సమా వేశం జరుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బాల నరేంద్ర తెలిపారు. అన్ని అంశాలపై ఈ సమావేశం ఉంటుందన్నారు. ప్రైవేటు సేవలపై సరైనా చర్యలు చేపడితే పేదలకు ఫీజుల భారం తగ్గే అవకాశం ఉంది.

Updated Date - 2021-05-09T05:28:41+05:30 IST