ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీ.. పుస్తకాలు, యూనిఫాంల పేరుతో గుంజుడు

ABN , First Publish Date - 2022-08-05T20:04:43+05:30 IST

దర్శిలో ప్రైవేట్‌ పాఠశాలల(Private schools) యాజమాన్యం పుస్తకాలు, ఫీజులు, యూనిఫాం(Uniform)ల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తోంది. వేలాది రూపాయలు

ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీ.. పుస్తకాలు, యూనిఫాంల పేరుతో గుంజుడు

అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న వైనం


దర్శి, ప్రకాశం, ఆగస్టు 4 : దర్శిలో ప్రైవేట్‌ పాఠశాలల(Private schools) యాజమాన్యం పుస్తకాలు, ఫీజులు, యూనిఫాం(Uniform)ల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తోంది. వేలాది రూపాయలు అడ్డగోలుగా ముక్కుపిండి గుంజుతుంది.  దీంతో విద్యార్థుల(students) తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. విద్యార్ధుల తల్లితండ్రులు(parents) తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించాలనే మోజులో నానా అవస్ధలు పడి వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు. విద్యార్ధుల తల్లితండ్రుల బలహీనలతను ఆసరాగా తీసుకోని ప్రై వేట్‌ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. దర్శి మండలంలో 33 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. అందులో కొన్ని పాఠశాలలు రేకుల షెడ్లులోనే కొనసాగుతున్నాయి. అధికశాతం ప్రైవేట్‌ పాఠశాలలకు ఆటస్ధలం కాని కనీస మౌళిక వసతులు గాని లేవు. విద్యాశాఖ అధికారులు ముడుపులు తీసుకొని ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతులు ఇస్తుండటంతో ఏళ్ల తరబడి కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు రేకులషెడ్లలోనే నడుస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తుకాగా పుస్తకాలు, యూనిఫాం పేరుతో ఈ ఏడాది గతంలో ఎన్నడూలేని విదంగా దోపిడీ చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి  తరగ తులను బట్టి రూ.3వేల నుంచి రూ.4వేలు వరకు పుస్తకాల కోసం, యూనిఫాంకు రూ.5 నుంచి రూ.6 వేలు వసూళ్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రైవే ట్‌ పాఠశాల్లోని విద్యార్ధులకు కూడా తక్కువ ధరలకు ప్రభుత్వం పుస్తకాలు అందజేస్తుంది. 


ఆయా పాఠశాలల విద్యార్థుల నుంచి ప్రభుత్వం ప్ర కటించిన ధరల ప్రకారం పుస్తకాలకు వ సూలు చేయడం లేదు. విద్యార్థుల లెక్క ప్ర కారం  చలానా కడితే విద్యా శాఖ పుస్త కా లను అందజేస్తుంది. ప్రభుత్వం అతి త క్కువ ధరలకు పుస్తకాలను సరఫరా చే స్తుండగా ప్రైవేట్‌ పాఠశాలలు అడ్డగోలుగా వేలాది రూపాయలు వసూళ్లు చేయటం పట్ల విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర అ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెప్పడంతో తల్లితండ్రులు అందుకు ఇష్టపడలేదని తెలిసింది. తమ పిల్లలకు చదువులు చెప్పకుండా ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో ఫిర్యాదులు  ఇవ్వడం లేదు. ఈ విషయంపై విద్యాశాఖ అధి కారులను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. పుస్తకాల పేరుతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అయినప్పటికీ విచారించి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో కె.రఘురామయ్య స్పష్టం చేశారు. 


ప్రభుత్వం ప్రకటించిన పుస్తకాల ధరలు

1వ తరగతికి రూ.280, 2వ తరగతికి రూ.298, 3వ తరగతికి రూ.443, 4వ తరగతికి రూ.466, 5వ తరగతికి రూ.479, 6వ తరగతికి రూ.326, 7వ తరగతికి రూ.414, 8వ తరగతికి రూ.464, 9వ తరగితకి రూ.555, 10వ తరగతికి రూ.648 

Updated Date - 2022-08-05T20:04:43+05:30 IST