కృష్ణుడు అతి పెద్ద పొల్టీషియన్: ఛత్తీస్‌గఢ్ సీఎం

ABN , First Publish Date - 2022-01-19T00:38:05+05:30 IST

కృష్ణుడు సత్యం కోసం పోరాడిన అతి పెద్ద రాజకీయనాయకుడని, కాంగ్రెస్ పార్టీ ఆయన..

కృష్ణుడు అతి పెద్ద పొల్టీషియన్: ఛత్తీస్‌గఢ్ సీఎం

మధుర: కృష్ణుడు సత్యం కోసం పోరాడిన అతి పెద్ద రాజకీయనాయకుడని, కాంగ్రెస్ పార్టీ ఆయన నుంచే పాఠాలు నేర్చుకుందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధురలోని శ్రీకృష్ణ మందిరంలో ఆయన మంగళవారంనాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యం కోసం ఎలా పోరడాలనేది కృష్ణుడిని చూసి నేర్చుకోవాలన్నారు.


యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రోజులు ముగియనున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వెలువడనున్నాయని యూపీ కాంగ్రెస్ విభాగం పరిశీలకుడిగా కూడా ఉన్న భూపేష్ బఘెల్ జోస్యం చెప్పారు. యూపీలో కాంగ్రెస్ పటిష్టంగా ఉందని, ప్రియాంక గాంధీ నాయకత్వంలో రైతులు, శ్రామికులు, మహిళల కోసం పార్టీ పోరాడుతూ మరింత పటిష్టమవుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఈసీఐ నిబంధలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఇంటింటి ప్రచారం సాగిస్తున్నామని చెప్పారు. కాగా, 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి 7 విడతల్లో పోలింగ్ జరుగనుంది. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ ప్రారంభమై మార్చి 7వ తేదీతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-01-19T00:38:05+05:30 IST