అంతరాలయ దర్శనం రద్దు

ABN , First Publish Date - 2022-01-18T06:05:42+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి అంతరాలయ దర్శనాలను నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు.

అంతరాలయ దర్శనం రద్దు

గంటకు వెయ్యి మందికి మూడు క్యూలలో అనుమతి.. 

ప్యాకెట్ల రూపంలో అన్నదానం

ద్వారకా తిరుమల ఆలయ ఈవో సుబ్బారెడ్డి

ద్వారకా తిరుమల, జనవరి 17 : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి అంతరాలయ దర్శనాలను నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ కార్యాలయంలో వివిధ విభాగాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులు మాస్కులు, శానిటైజర్లతో వినియో గిస్తూ భౌతిక దూరం పాటించాలని కోరారు. అనారోగ్యంతో ఉన్న వారు కోలుకున్న తర్వాతే రావాలన్నారు. గంటకు వెయ్యి మందిని మాత్రమే అనుమతించి, వారిని మూడు క్యూలైన్లలో శ్రీవారి దర్శనానికి పంపిస్తామన్నారు. నిత్య కల్యాణం, అష్టో త్తరం వంటి ఆర్జిత సేవల టిక్కెట్లను 50 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఆన్‌ లైన్‌ ద్వారా భక్తులు సేవలు బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఉచిత ప్రసాదం, తీర్ధం, శఠారి, నిలుపుదల చేశామని తెలిపారు. శ్రీవారి ఉచిత అన్న ప్రసాదాన్ని ప్యాకెట్ల ద్వారా భక్తులకు ఇవ్వనున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-01-18T06:05:42+05:30 IST