లారీపై విరిగిన చెట్టు కొమ్మలు

ABN , First Publish Date - 2020-12-04T05:06:57+05:30 IST

నాయుడుపేట - పూతలపట్టు రోడ్డులో శ్రీరామ్‌నగర్‌ కాలనీ సమీపంలో వెళ్తున్న ఓ ధాన్యం లారీపై చెట్టు కొమ్మలే విరిగిపడ్డాయి.

లారీపై విరిగిన చెట్టు కొమ్మలు

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 3 : నాయుడుపేట - పూతలపట్టు రోడ్డులో శ్రీరామ్‌నగర్‌ కాలనీ సమీపంలో వెళ్తున్న ఓ ధాన్యం లారీపై చెట్టు కొమ్మలే విరిగిపడ్డాయి. ఈ ఘటన గురువారం జరిగింది. లారీలో ఉన్న వారికి ఎటువంటి  ప్రమాదం జరగలేదు. లారీ సిబ్బంది కూలీల ద్వారా  ఆ కొమ్మలను తొలగించారు. 

Updated Date - 2020-12-04T05:06:57+05:30 IST