బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-01-24T03:43:35+05:30 IST

అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో బైక్‌పైన వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి

అక్కన్నపేట, జనవరి 23: అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో బైక్‌పైన వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కట్కూర్‌ గ్రామానికి చెందిన పులిసురేష్‌(40) బైక్‌పై హుస్నాబాద్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొన్నది. దీంతో సురేష్‌ తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత,కుమార్తె ఉన్నారు.

Updated Date - 2022-01-24T03:43:35+05:30 IST